ఫోటో స్టోరి: మియామీ బికినీ బీచ్ లో చిరుత పిల్ | Neha Sharma Stunning Pose In Beach
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సరసన చిరుత చిత్రంలో నటించింది నేహాశర్మ. ఏయ్ బాబూ ఇటు రా..! అంటూ తన బాడీ గార్డ్ అయిన చెర్రీతో శర్మాగాళ్ వెటకారం ఇంకా మెగాభిమానులు మర్చిపోలేదు. ఇక తొలి సినిమా తర్వాత ఈ అమ్మడు పూర్తిగా ముంబై పరిశ్రమకే అంకితమైంది. ఇటీవల శర్మాగాళ్ సోషల్ మీడియా దుమారం ఓ రేంజులో ఉంది. అటు బాలీవుడ్ లో వరుసగా అవకాశాలు అందుకుంటోంది.
2019-20 సీజన్ ఆద్యంతం వరుసగా బికినీ బీచ్ సెలబ్రేషన్స్ తో నేహాశర్మ ఇచ్చిన ట్రీట్ ని జనం ఇంకా మర్చిపోలేదు. తన సోదరి ఐషా శర్మతో కలిసి రెగ్యులర్ గా యోగా భంగిమలతో పాటు పూల్ సైడ్ ట్రీట్ ని ప్లాన్ చేస్తుంటుంది. ఒక రకంగా శర్మా గాళ్ కంబ్యాక్ నిజంగా ఒక మిరాకిల్ అనే చెప్పాలి.
నేహా శర్మ ప్రస్తుతం ఫ్లోరిడాలోని మియామి బీచ్ లో చిలౌట్ చేస్తోంది. న్యూ ఇయర్ సంబరాల కోసం అక్కడకు వెళ్లిన నేహా వరుస బికినీలతో వేడెక్కించేస్తోంది. ప్రస్తుతం నేహాశర్మ ఇన్ స్టా ఆద్యంతం బికినీలతో పాటు బీచ్ సెలబ్రేషన్ కి సంబంధించిన ఫోటోలతో హీటెక్కిస్తోంది.
తాజాగా నీలిరంగు బాడీకాన్ బికినీలో ఫోటో సిరీస్ అభిమానులు.. సోషల్ మీడియా అనుచరులను మెంటలెక్కిస్తోంది. ఈ ప్రత్యేకమైన ఫోటో రెండు గంటల వ్యవధిలో 60 లక్షలు పైగా లైక్ లతో దుమారం రేపింది. `తానాజీ` లాంటి హిస్టారికల్ మూవీలో కథానాయికగా నటించిన నేహాశర్మ ప్రస్తుతం పలు క్రేజీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇటీవలే నేహా నటించిన జీ5 ఒరిజినల్ సిరీస్ `తాయిష్` జనాదరణ పొందింది. పంజాబీ మూవీ `ఇక్ సంధు హుందా సి` రిలీజ్ కి రెడీ అవుతోంది.
Post a Comment