హైదరాబాద్ లో ల్యాండ్ అయిన ఐశ్వర్య రాయ్ | Aishwarya Rai landed in Hyderabad
బాలీవుడ్ ముద్దుగుమ్మ ఐశ్వర్య రాయ్ హైదరాబాద్ కు వచ్చారు. తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం రూపొందించబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం పొన్నియన్ సెల్వం సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు ఆమె హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీకి వచ్చారు. కరోనా ముందు ప్రారంభించాల్సిన పొన్నియన్ సెల్వం మూవీ అనేక కారణాల వల్ల వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. ఎట్టకేలకు షూటింగ్ ను ప్రారంభించడంతో పలువురు నటీనటులు హైదరాబాద్ వస్తున్నారు. సుదీర్ఘ కాలంగా మణిరత్నం ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాడు.
బాలీవుడ్.. కోలీవుడ్ కు చెందిన ఎంతో మంది స్టార్ నటీనటులు ఈ సినిమాలో నటించబోతున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్ కి సంబంధించిన కీలక సన్నివేశాలను రామోజీ ఫిల్మ్ సిటీలో చేయబోతున్నారు. దాదాపు నెల రోజుల పాటు ఐశ్వర్య రాయ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణలో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఐశ్వర్య రాయ్ తో పాటు అభిషేక్ బచ్చన్ మరియు కూతురు ఆరాద్య లు కూడా రామోజీ ఫిల్మ్ సిటీకి వచ్చారు. కొన్ని రోజుల తర్వాత వారు తిరిగి ముంబయి వెళ్లనున్నారు. ఐశ్వర్య మాత్రం తన షెడ్యూల్ పూర్తి చేసుకుని వెళ్లనున్నట్లుగా చెబుతున్నారు.
Post a Comment