Header Ads

మదనపల్లె ఎపిసోడ్ లో సోషల్ మీడియా ఖాతాల్లో కొత్త అనుమానాలు? | Madanapalle murder case

 Madanapalle murder case

సంచలనంగా మారిన మదనపల్లె అక్కాచెల్లెళ్ల దారుణ హత్యకు సంబంధించి కొత్త అంశాలు వెలుగు చూస్తున్నాయి. పెద్దామ్మాయి అలేఖ్య.. చిన్న కమార్తె సాయి దివ్య సోషల్ మీడియా ఖాతాలకు సంబంధించి కొత్త సందేహాలు ఇప్పుడు తెర మీదకు వచ్చాయి. అలేఖ్యకు ఫేస్ బుక్.. ఇన్ స్టా అకౌంట్లు ఉన్నాయి. జనవరి 16 వరకు అంతా బాగానే ఉన్నా.. హత్యలు జరగటానికి మూడు రోజుల ముందు నుంచి వివాదాస్ప రీతిలో పోస్టులు పెట్టటం గమనార్హం.

21న శివ ఈజ్ కమింగ్ అని పోస్టు పెట్టిన అలేఖ్య.. అదే రోజు వర్క్ ఈజ్ డన్ అని పోస్టు పెట్టింది. 22న క్రిష్ణుడి బొమ్మతో సెల్ఫీ దిగిన అలేఖ్య.. మోహినీ అనే హ్యాష్ టాగ్ వాడినట్లు గుర్తించారు. ఇదే రోజున ఆమె తన ఎఫ్ బి ఖాతా పేరును మోహినీగా మార్చింది. ఆ రోజునే వేరే మతానికి సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలతో మరో పోస్టు పెట్టినట్లుగా గుర్తించారు. హత్యకు గురి కావటానికి రెండురోజుల ముందు కూడా అలేఖ్య సోషల్ మీడియాలో చురుగ్గానే ఉన్నారు.

పెద్దమ్మాయి అలేఖ్యయ ఫోటోను చిన్నమ్మాయి సాయి దివ్య డీపీ (డిస్ ప్లే పిక్చర్) గా ఎవరు మార్చారన్నది ప్రశ్నగా మారింది. చిన్నమ్మాయి ఖాతాకు దివ్స్ అలేఖ్య అని ఎవరు మార్చారన్నది కూడా అర్థం కావట్లేదు. మరికొన్ని అంశాల్ని పరిగణలోకి తీసుకుంటే సాయిదివ్య అకౌంట్లో ఎవరో మార్పులు చేసినట్లుగా డౌట్లు రావటం ఖాయం. అంతేకాదు.. సాయిదివ్య సోషల్ ఖాతాలోనికొన్ని పోస్టులు డిలీట్ కావటం వెనుక ఎవరున్నారు? అన్నది మరో ప్రశ్న.

అలేఖ్య అకౌంట్ ప్రైవేటుగా ఉందని.. ఆమె ఓకే చేసిన వారు మాత్రమే చూసే అవకాశం ఉంది. అలాంటప్పుడు వివాదాస్పద పోస్టులను అందరూ చూసేలా ప్రైవసీ సెట్టింగుల్ని మార్చిందెవరు? అన్నది మరో సందేహం. హత్యకు గురి కావటానికి మూడు రోజులు ముందు అలేఖ్య ఒక ఫోటోను పోస్టు చేసింది. ఒక కారు అద్దంలో నుంచి చూస్తే అదేదో కొండ ప్రాంతంలా ముళ్లపొదలు.. బండరాళ్లతో కనిపిస్తుంది.

ఈ ఫోటోఅప్ లోడ్ చేసిన జనవరి 16న అలేఖ్య ఎక్కడికైనా వెళ్లి ఉండాలి. అదే నిజమనుకుంటే.. ఆమె ఎక్కడికి వెళ్లింది? ఎవరితో వెళ్లింది? అన్న ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సిన అవసరం ఉంది. అంతేకాదు.. ఆమె సోషల్ మీడియా ఖాతాల్ని మేనేజ్ చేసిన సమయం.. ప్రాంతం.. ఏ మాధ్యమం నుంచి చేశారన్న దానిపై విచారణ జరపాల్సిన అవసరం ఉందని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. అక్కాచెల్లెళ్లు ఇద్దరికి కుక్కలంటే ప్రాణంగా చెబుతారు. హత్యకు కొద్ది రోజులు ముందు కుక్కను బయటకు తీసుకెళ్లినప్పుడు మంత్రించిన నిమ్మకాయను తొక్కినట్లుగా సాయి దివ్య భయపడిన వైనం రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న సంగతి తెలిసిందే. మరి.. అలాంటప్పుడు ఇప్పటివరకు ఆ కుక్క ఏమైంది? ఎక్కడ ఉంది? అన్నది మరో ప్రశ్న.

No comments

Powered by Blogger.