Header Ads

ప్రభాస్ ‘ఆదిపురుష్’లో డ్రీమ్ గర్ల్..? | Hema Malini To Act In Adipurush

 Hema Malini To Act In Adipurush

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతన్న ప్రతిష్టాత్మక సినిమాల్లో ఒకటి ఆదిపురుష్. బాలీవుడ్ బడా డైరెక్టర్ సంజయ్ రౌత్ రూపొందిస్తున్నారు. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో నిర్మాణమవుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ లాంటి స్టార్స్ నటిస్తున్నారు.

ప్రస్తుతం రాధేశ్యామ్ తో బిజీగా ఉన్న ప్రభాస్.. ఈ మధ్యనే సలార్ కూడా స్టార్ట్ చేశాడు. అయితే.. ప్రభాస్ టైట్ షెడ్యూల్ కారణంగా.. ప్రారంభోత్సవానికి కూడా వచ్చే వీలు లేకపోవడంతో రెబల్ స్టార్ లేకుండానే షూటింగ్ స్టార్ట్ మొదలు పెట్టనున్నాడట దర్శకుడు. ఈ షెడ్యూల్ లో మిగిలిన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు సమాచారం.

అయితే.. ఈ చిత్రానికి సంబంధించి ఎన్నో రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి. లేటెస్ట్ గా మరో రూమర్ తెరపైకి వచ్చింది. ఇది నెటిజన్లను కూడా బాగా ఆకట్టుకుంటోంది. ‘ఆదిపురుష్’లో మాజీ హీరోయిన్ డ్రీమ్ గర్ల్ హేమా మాలిని ఓ కీలక పాత్రలో నటించబోతున్నారనే చర్చ నడుస్తోంది. చాలా కాలంగా హేమా మాలిని సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.

ఈ మధ్యలో కొన్ని సినిమాల్లో కనిపించినా.. ఎంతో ప్రాముఖ్యత కలిగిన పాత్ర అయితే తప్ప ఆ సినిమాలు చేయట్లేదు. అయితే.. హాలీవుడ్ రేంజ్ లో రూపొందించబోతున్న ఆదిపురుష్ లో అత్యంత కీలక పాత్ర ఉందట. ఆ పాత్రకు హేమా మాలిని అయితేనే న్యాయం జరుగుతుందని భావించిన యూనిట్.. ఆమెను సంప్రదించింది. చివరకు ఒప్పించారని కూడా తెలుస్తోంది.

ఇక ఈ సినిమా కోసం ప్రభాస్ బాడీ కూడా పెంచనున్నాడట. భారీ కాయుడిగా కనిపించాల్సిన అవసరం ఉండడంతో రెబల్ స్టార్ కసరత్తులు చేసేందుకు సిద్ధమవుతున్నాడట. మొత్తానికి ప్రారంభంలోనే మంచి హైప్ క్రియేట్ చేసిన ఆదిపురుష్.. తెరపై ఎలా ఉంటుందో చూడాలి.

No comments

Powered by Blogger.