చక్కనమ్మ చీర కడితే ఆ చీరకే సిగ్గేసింది! | Jacqueline Fernandez Latest Stunning Pose In Saree
`సాహో` చిత్రంలో బ్యాడ్ బోయ్ అంటూ అదిరిపోయే స్పెషల్ సాంగ్ తో ఎంట్రీ ఇచ్చింది శ్రీలంకన్ బ్యూటీ జాక్విలిన్ ఫెర్నాండెజ్. బ్యాడ్ బోయ్ ప్రభాస్ మెచ్చిన హాట్ బ్యాడ్ గాళ్!! అంటూ కితాబిచ్చేశారు డైహార్డ్ ఫ్యాన్స్. ఆరంగేట్రమే కుర్రాళ్ల గుండెల్లో చక్కిలిగింతలు పెట్టేసిన ఈ అమ్మడు ఆ తర్వాత తెలుగులో వేరొక సినిమా చేసిందేమీ లేదు. ఇటీవల పవన్ కల్యాణ్ సరసన నటిస్తుందని ప్రచారమైనా దానికి అధికారిక కన్ఫర్మేషన్ లేదు.
బాలీవుడ్ హాట్ బాంబర్ ప్రస్తుతం పలు క్రేజీ సినిమాలతో బిజీగా ఉంది. ఇక జాకీ నిరంతర ఇన్ స్టా వీడియోలు ఫోటోలు అంతర్జాలాన్ని షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. జిమ్ యోగాలో తనవైన హాటెస్ట్ లుక్స్ తో స్టన్ అయిపోయే ట్రీటిస్తోంది. తాజాగా చీరలో జాకీ స్టన్నింగ్ లుక్ సంచలనంగా మారింది. టిల్ డేట్ హాటెస్ట్ పింక్ అండ్ వైట్ శారీ ఇదే అంటూ బోయ్స్ కామెంట్లతో చెలరేగుతున్నారు. నిరంతరం బికినీలు జిమ్ డ్రెస్సులతో చెలరేగే బ్యాడ్ గాళ్ చీర కడితే ఎలా ఉంటుందో ఇదిగో ఇదే శాంపిల్. .. జాకీ దెబ్బకు ఆ చీరకే సిగ్గేసింది! అంటూ వ్యాఖ్యలతో రెచ్చిపోతున్నారు యూత్. ఈ సూపర్ హాట్ లుక్ వైరల్ గా మారింది.
కెరీర్ సంగతి చూస్తే.. ప్రస్తుతం జాకీ వరుస సినిమాలు .. వెబ్ సిరీస్ లతో బిజీ బిజీ. ఐటెమ్ నంబర్లతో పాటు వాణిజ్య ప్రకటనల్లోనూ నటిస్తూ నాలుగు చేతులా ఆర్జిస్తోంది. బాలీవుడ్ కెరీర్ కీలక దశలో జాకీ వెంట నిలిచి సల్మాన్ భాయ్ ఆదుకున్నారన్న టాక్ కూడా ఉంది.
Post a Comment