Header Ads

ప్రభాస్ వదిలిన 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' టీజర్..! | Ichata Vahanumulu Niluparadu Teaser

 Ichata Vahanumulu Niluparadu? Teaser

'చిలసౌ' సినిమా తర్వాత అక్కినేని హీరో సుశాంత్ సోలోగా నటిస్తున్న రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ "ఇచ్చట వాహనములు నిలుపరాదు". 'నో పార్కింగ్' అనేది దీనికి ఉప శీర్షిక. వాస్తవ సంఘటనల ఆధారంగా కొత్త దర్శకుడు ఎస్. దర్శన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఏ1 స్టూడియోస్ మరియు శాస్త్ర మూవీస్ బ్యానర్లపై రవిశంకర్ శాస్త్రి - ఏక్తా శాస్త్రి - నటుడు హరీష్ కోయలగుండ్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో సుశాంత్ కి జోడీగా మీనాక్షి చౌదరి నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఈ క్రమంలో తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ సినిమా టీజర్ ని సోషల్ మీడియా వేదికగా విడుదల చేసి చిత్ర యూనిట్ కి అభినందనలు తెలియజేశారు.

'నా లైఫ్ లో అమ్మకి అమ్మాయికి బైక్ కి అవినాభావ సంబంధం ఉంది..' అంటూ హీరో సుశాంత్ చెప్పే డైలాగ్ తో ఈ టీజర్ ప్రారంభమైంది. తనకు ఎంతో ఇష్టమైన బైక్ ని అనుకోని పరిస్థితుల్లో నో పార్కింగ్ ప్లేస్ లో పార్క్ చేసిన ఓ యువకుడి లైఫ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే నేపథ్యంలో ఈ సినిమా రూపొందినట్లు తెలుస్తోంది. ఇందులో వెంకట్ - వెన్నెల కిషోర్ - ప్రియదర్శి - అభినవ్ గోమటం - నిఖిల్ - కైలాస - కృష్ణచైతన్య తదితరులు ఇతర పాత్రల్లో కనిపిస్తున్నారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది.

No comments

Powered by Blogger.