Header Ads

హీరో అజిత్ కొడుకును చూస్తే ఫిదానే? | Do you know how Ajit son

 Do you know how Ajit's son is?

తమిళనాట స్టార్ హీరో అజిత్ ముద్దుల కొడుకు ఫొటోలు తాజాగా బయటకు వచ్చాయి. తండ్రి స్మార్ట్ నెస్ ను మించి ఈ బుడ్డోడు కనిపించేసరికి సినీ సెలెబ్రెటీలు అభిమానులు ఫిదా అయ్యారు. ఇప్పుడీ బుడతడి ఫొటోలు వైరల్ గా మారాయి.అజిత్ హీరోయిన్ షాలినిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి అనౌష్క ఆద్విక్ అనే పాప బాబు ఉన్నారు. తాజాగా చెన్నైలో జరిగిన సన్నిహితుల వివాహానికి షాలిని తన చెల్లెలు షామిలీ కొడుకు అద్విక్ తో కలిసి హాజరైంది.

ఈ ఫంక్షన్ ఫొటోలను అజిత్ ఫ్యాన్స్ సంపాదించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయ్యాయి. అజిత్ కొడుకు ఆద్విక్ ఫొటోలు చూసి ‘లిటిల్ అజిత్’ కుట్టి తల అంటూ అభిమానులు తెగ షేర్లు చేస్తున్నారు. భలే ముద్దుగా క్యూట్ గా ఉన్న ఇతగాడి ఫొటోలు ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి.ఎప్పుడూ బయట కనపించని షాలిని ఆమె కుమారుడ ఆద్విక్ ఇలా బయటకొచ్చేసరికి వారి ఫొటోలను తీసి కొందరు వైరల్ చేశారు. ఆద్విక్ మరో హీరో కావడం పక్కా అని అజిత్ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.

No comments

Powered by Blogger.