ఎత్తైన కొండ మీద లవ్ ప్రపోజల్ .. కొంప ముంచింది..! | Hearing the proposal of the wedding the girlfriend leg slipped from the height
అందరి దృష్టిలో పడాలంటే ఏ పని అయినా కాస్త విభిన్నంగా చేయాలి. ప్రస్తుతం చాలా మంది యువత అలాగే ఆలోచిస్తున్నారు. అందుకే అడవుల్లో ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ షూట్ లు.. మంటల్లో ఫొటోలు తీసుకుంటూ తమ క్రియేటివిటీని ప్రదర్శిస్తున్నారు. ఏదైనా ఓ లిమిట్ వరకు ఓకే.. కానీ మరీ హద్దులు దాటి ఓవర్ యాక్షన్ చేస్తే మాత్రం ప్రాణాలమీదకు తెచ్చుకోవడం ఖాయం. ఇటువంటి పనిచేసిన ఓ జంట ప్రాణాలమీదకు తెచ్చుకున్నది. ఆస్ట్రియా కారింథియాలో ఓ యువకుడు( 27).. తాను ప్రేమించిన అమ్మాయికి కాస్త విభిన్నంగా ప్రపోస్ చేద్దామనుకున్నాడు.
దాదాపు 650 అడుగుల ఎత్తైన కొండ మీద ఆమెకు ‘ ఐలవ్యూ’ చెబుదామనుకున్నాడు. ఇందుకు ప్రేమించిన అమ్మాయి కూడా ఒప్పుకున్నది. ఇంకేముంది ఇద్దరూ కలిసి ఓ ఎత్తైన కొండమీదకు ఎక్కారు. అక్కడికి వెళ్లాక ఆ యువకుడు ఆమెకు ప్రపోస్ చేశాడు. కానీ ఈ కొండకు ఆనుకొని ఉన్న లోయను వాళ్లు గమనించలేదు. ఒక్కసారిగా ఓ కొండ మీదినుంచి లోయలోకి పడిపోయారు. అంత ఎత్తైన కొండమీదనుంచి పడిపోతే.. ప్రాణాలు కాదు కదా..! కనీసం శరీర భాగాలు కూడా దొరకవు. కానీ వాళ్ల అదృష్టం బాగుండి ఓ మంచులోయలో పడిపోయారు.
అయితే వెంబడే స్పందించిన అక్కడి ప్రభుత్వం హెలిక్యాప్టర్ల సాయంతో వాళ్లను బయటకు తీశారు. ప్రస్తుతం వాళ్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే వాళ్లకు ప్రాణాపాయం ఏమి లేదని వైద్యులు అంటున్నారు. కానీ ఇక నుంచి ప్రేమికులు ఇటువంటి దుస్సాహసాలు చేయొద్దని అక్కడి ప్రభుత్వం హెచ్చరించిందట. అయితే డిసెంబర్ 27 న ఈ ఘటన జరగగా కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Post a Comment