Header Ads

గుడ్ న్యూస్ : ఆ కేన్సర్ మందుతో కరోనాకు చెక్! | Check the corona with that cancer drug



కరోనా మొదలైనప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది వైరస్ బారినపడ్డారు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో కుటుంబాల్లో తీవ్ర వేదన నింపింది. వైరస్ ను అంతం చేసే టీకా కనిపెట్టేందుకు  ఎన్నో దేశాల శాస్త్రవేత్తలు అహోరాత్రులు పనిచేస్తున్నారు. చాలా దేశాల్లో వ్యాక్సిన్ల తయారీ చివరి దశకు చేరుకుంది. కొన్ని దేశాలు వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ కూడా చేపట్టాయి. అయితే అందులో ఏ వ్యాక్సిన్లు పని చేస్తాయో ఏవి పని చేయవో కూడా తెలియడం లేదు. అమెరికాలో అక్కడి ప్రజలకు ఆస్ట్రా జెనేకా టీకా వేస్తున్నారు. ఈ వ్యాక్సిన్ ప్రపంచంలోనే అత్యుత్తమైనదిగా పేరు తెచ్చుకుంది. ఈ టీకా తీసుకుంటే సత్ఫలితాలు గ్యారెంటీ అనే పేరు వచ్చింది.

అయితే వ్యాక్సిన్ తీసుకున్న  ఓ నర్స్ ఇటీవల కరోనా బారిన పడటం షాక్ కు గురి చేసింది. బాగా పని చేస్తుందనుకున్న టీకాను  కూడా నమ్మలేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో చైనాకు చెందిన వైద్యులు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. లింఫో మస్ కేన్సర్ చికిత్స కోసం కొన్నేళ్ళుగా ఉపయోగిస్తున్న 'ప్రలేట్రేక్సేట్ ' మందును వినియోగించి కరోనా వైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని వైద్యులు  ప్రకటించారు. చైనాలోని షెంజెన్ ఇనిస్టి ఆఫ్ అడ్వాన్స్ డ్ టెక్నాలజీ కి చెందిన డాక్టర్ హైపింగ్ జంగ్ ఆధ్వర్యంలోని  బృందం ఈ మందుపై విస్తృతంగా పరిశోధన జరిపి ఈ విషయాన్ని కనుగొనింది.

  ప్రస్తుతం కరోనా బారిన పడ్డవారికి రెమ్ డేసివిర్ మందుగా  ఇస్తూ వస్తున్నారు. అయితే ఆ మందు కన్నా కరోనాను నియంత్రించడంలో ప్రలేట్రేక్సేట్ కొన్ని రెట్లు మెరుగ్గా పని చేస్తోందని చైనా వైద్య బృందం గుర్తించింది. ప్రలేట్రేక్సేట్ మందును వినియోగించేవారికి అలసట అల్సర్ రావడం కడుపులో మంట వికారం వంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ మందు ద్వారా తలెత్తే సైడ్ ఎఫెక్ట్స్ ని కంట్రోల్ చేయగలిగే పరిశోధనలు చేపట్టవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చైనా వైద్య బృందం ఈ సందర్భంగా వెల్లడించింది.

ప్రలేట్రేక్సేట్ కేన్సర్ కి మందుగా వినియోగించడానికి 2009 లోనే అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి ఇచ్చింది. అప్పటి నుంచి ఈ మందును కేన్సర్ వ్యాధిగ్రస్తులకు విరివిగా వినియోగిస్తున్నారు. తాజాగా చైనా వైద్య బృందం విస్తృత పరిశోధనల అనంతరం ఈ మందు కరోనా అంతానికి కూడా వినియోగించ వచ్చని  తేల్చారు. కరోనా నివారణకు వ్యాక్సిన్లు సిద్ధం అయినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వందల కోట్ల మందికి టీకాలు వేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తవడానికి చాలాకాలం సమయం పట్టొచ్చు. ఆలోగా కరోనాకు ప్రత్యామ్నాయ చికిత్సల ద్వారా అడ్డుకట్ట వేసేందుకు ఎప్పటికప్పుడు కొత్త మందులను కనిపెట్టాల్సిన అవసరం ఉందని డాక్టర్ హైపింగ్ జంగ్ పేర్కొన్నారు.

No comments

Powered by Blogger.