విజయ్ దేవరకొండని క్రాస్ బ్రీడ్ 'లైగర్' గా మార్చిన పూరీ..! | First Look Poster Meet The Crossbreed Rowdy In Liger
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ - డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో ఓ స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్ లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పూరీ కనెక్ట్స్ బ్యారర్ ఫై పూరీ - ఛార్మీ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా వ్యహరిస్తున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంతో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే టాలీవుడ్ కి పరిచయమవుతోంది. 'ఫైటర్' అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి తాజాగా టైటిల్ ని ఖరారు చేసారు.
పూరీ - విజయ్ దేవరకొండ కాంబోలో వస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి ‘లైగర్’ అనే టైటిల్ ని మేకర్స్ ఖరారు చేసారు. 'సాలా క్రాస్ బ్రీడ్' అనేది ఉపశీర్షిక. 'లైగర్' అనగా సింహం మరియు పులికి పుట్టిన సంకరజాతి జంతువు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ లుక్ ని కూడా రివీల్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో హీరో క్యారెక్టర్ ని సూచించేలా పులి - సింహం ఫోటోలను బ్యాక్గ్రౌండ్ లో చూపించారు. బరిలో దిగిన విజయ్ ఇంటెన్స్ లుక్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా షూటింగ్ ముంబైతో పాటు విదేశాల్లో జరుపనున్నారు. తెలుగు హిందీ భాషాల్లో మాత్రమే కాకుండా ఇతర ప్రధాన భాషల్లో 'లైగర్' విడుదలకానుంది.
Post a Comment