Header Ads

‘వాదించడమూ తెలుసు.. వాయించడమూ తెలుసు..’ దుమ్ములేపుతున్న వకీల్ సాబ్ టీజర్ | Pawan Kalyan Vakeel Saab Teaser Mixture Of Class Mass

 Pawan Kalyan Vakeel Saab Teaser Mixture Of Class Mass

పవన్ కల్యాణ్ గట్స్ గురించి ఫ్యాన్స్ కు తప్ప మరెవరికీ తెలియదు. అందుకే ఆయనకు అభిమానులు ఉండరు.. భక్తులు మాత్రమే ఉంటారట. అలాంటి హీరో సినిమాలకు దూరమై దాదాపు మూడు సంవత్సరాలు. పవర్ స్టార్ పవర్ చూసేదెలా అని ఫ్యాన్స్ ఆరాటపడుతున్న సమయంలో ‘వకీల్ సాబ్’ మూవీని అనౌన్స్ చేశాడు పవన్. అంతే.. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా? అని ఎదురు చూస్తున్న అభిమానులు.. దానికన్నా ముందుగా మోస్ట్ అవైటెడ్ టీజర్ కోసం అర్రులు చాచారంటే అతిశయోక్తి కాదు.

అన్ని అవాంతరాలనూ దాటుకొని సంక్రాంతి పర్వదినం సందర్భంగా రిలీజైంది వకీల్ సాబ్ టీజర్. ఒక నిమిషం ఒక సెకన్ నిడివి కలిగిన ఈ టీజర్ మోస్ట్ పవర్ ప్యాక్డ్ విజన్ ను ఎక్స్ ప్రెస్ చేసింది. ‘అబ్జక్షన్ యువర్ హానర్’ అంటూ మొదలైన ఈ టీజర్ ను మొత్ం పవన్ మాత్రమే ఆక్రమించారు.

కోర్టులో వాదించడమూ తెలుసు..కోటు తీసి కొట్టడమూ తెలుసు’ అంటూ కేవలం రెండే డైలాగులతో ముగించిన ఈ టీజర్ అభిమానులకు గూస్ బమ్స్ చేసింది. ఎప్పుడెప్పుడు మిగిలిన సినిమాను చూసేద్దామా? అనే కోరికను రెట్టింపు చేసింది.

అభిమానుల్లో భారీ అంచనాలతో రాబోతున్న ఈ టీజర్ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఈ టీజర్ పవర్ ప్యాక్డ్ గా ఉందని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. పవన్ ఈ కమ్ బ్యాక్ టీజర్ తోనే రికార్డుల వేట మొదలు పెట్టారని ఆనందం వ్యక్తంచేస్తున్నారు.

బాలీవుడ్ హిట్ చిత్రం ‘పింక్’కు ఇది రీమేక్ అన్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ న్యాయవాదిగా కనిపించనున్నారు. పవన్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని యువ దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తున్నారు. థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.




No comments

Powered by Blogger.