'FCUK' టీజర్: అమ్మాయిలతో రాసలీలలు సాగిస్తున్న తండ్రీకొడుకులు..! | FCUK teaser Fathers and sons having romance with girls
శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్ పై ఎల్. దామోదర్ ప్రసాద్ ''FCUK'' (ఫాదర్ - చిట్టి - ఉమ - కార్తీక్) అనే చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విద్యాసాగర్ రాజు దర్శకత్వం వహించారు. ఇందులో సీనియర్ నటుడు జగపతి బాబు - రామ్ కార్తీక్ - అమ్ము అభిరామి(తమిళ్ 'అసురన్' ఫేమ్) - బాల నటి సహశ్రిత ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇటీవలే ప్రధాన పాత్రల ప్రచార చిత్రాలు విడుదల చేశారు. ఈ క్రమంలో తాజాగా 'FCUK' టీజర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
ఇందులో ఫణి భూపాల్ అనే రొమాంటిక్ ఫాదర్ పాత్రలో జగపతిబాబు కనిపిస్తున్నాడు. గాలికి తెలియంత వేగంగా రాముడు బాణం విసిరినట్లు ఇతను అమ్మాయిలను పడేస్తాని టీజర్ లో వెల్లడించారు. అమ్మాయిలని ప్లర్ట్ చేసే అతని కొడుకు పాత్రలో రామ్ కార్తీక్ కనిపిస్తున్నాడు. అలాంటి తండ్రీకొడుకులు లైఫ్ లోకి డాక్టర్ ఉమ మరియు చిట్టి పాత్రలు వచ్చిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయన్నదే 'FCUK' కథాంశంగా టీజర్ చూస్తే తెలుస్తోంది. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తుండగా శివ.జి ఛాయాగ్రహణం అందించారు. కిషోర్ మద్దాలి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. అలీ - దగ్గుబాటి రాజా - కళ్యాణి నటరాజన్ - బ్రహ్మాజీ - కృష్ణ భగవాన్ - రజిత - జబర్దస్త్ రామ్ ప్రసాద్ - నవీన్ - వెంకీ - రాఘవ - భరత్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Post a Comment