30.75 లక్షల మందికి ఇండ్లు : ఏపీ సీఎం జగన్ | Ap Government to provide house sites to 30.75 lakh eligible people said cm jagan
హైదరాబాద్: లైట్ హౌజ్ ప్రాజెక్టు కింద ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇండ్లను నిర్మించనున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రధాని మోదీతో జరిగిన వర్చువల్ కార్యక్రంలో ఆ రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కార్యక్రమాన్ని అమలు చేయడంలో దేశంలోనే ఏపీ ముందు వరుసలో ఉన్నట్లు సీఎం జగన్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 30.75 లక్షల మంది అర్హులైన వారికి ఇండ్లను ఇచ్చేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు సీఎం జగన్ వెల్లడించారు. దీని కోసం సుమారు 68,677 ఎకరాల స్థలాన్ని ఆయా కుటుంబాలకు అందజేసినట్లు సీఎం చెప్పారు. 2022 నాటికి ప్రతి ఒక్కరికీ ఇంటిని అందించాలని ప్రధాని లక్ష్యం పెట్టుకున్నారని, ఆ నాటికి భారత స్వాతంత్య్రానికి 75 ఏళ్లు నిండుతుందని సీఎం జగన్ తెలిపారు. లైట్ హౌజ్ ప్రాజెక్టు ఏపీ రాష్ట్రానికి కీలకమైందని, ఎందుకంటే ఇక్కడ సహజ విపత్తులైన తుఫాన్లు, వరదలు ఎక్కువ అని ఆయన అన్నారు.
Post a Comment