‘తెర వెనుక’ చిత్రం చూసిన రకుల్.. | Rakul who saw the movie Tera Venuka Chitram
అటు నార్త్.. ఇటు సౌత్ లో వరుస సినిమాలు చేస్తూ అగ్ర హీరోయిన్ గా దూసుకెళ్తోంది రకుల్ ప్రీత్ సింగ్. అయితే.. ఇప్పుడు తన తమ్ముడిని కూడా వెండి తెరకు పరిచయం చేస్తోంది ఈ బ్యూటీ. తన అందం అభినయంతో ఇండస్ట్రీలో తనదైన గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. ఇప్పుడు తన సోదరుడిని కూడా ఆశీర్వదించాలని కోరుతోంది.
ఆమె సోదరుడు అమన్ హీరోగా రూపొందించిన చిత్రం ‘తెరవెనుక’. ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రకుల్ సోదరుడు. ధిమాన్ దీపికరెడ్డి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం.. సామాజిక ఇతివృత్తంతో తెరకెక్కింది. మహిళా రక్షణకు ఎన్ని చట్టాలు ఉన్నా.. స్వీయ రక్షణ అవసరం తప్పనిసరి అనే కథాంశంతో రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్.. ఊహకందని మలుపులతో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది.
‘బెల్స్’ ‘బంతిపూల జానకి’ వంటి చిత్రాలను రూపొందించిన నెల్లుట్ల ప్రవీణ్చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మురళీ జగన్నాథ్ మచ్చ నిర్మాతగా వ్యవహరించారు. ఈ మూవీకి రఘురామ్ సంగీతం అందించారు.
రకుల్ సోదరుడు అమన్ డెబ్యూ మూవీ అయిన ‘తెర వెనుక’ చిత్రాన్ని బిగ్ స్క్రీన్లో విడుదల చేశారు. కాగా.. ఈ చిత్రాన్ని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన తల్లిదండ్రులు సోదరుడితో కలిసి హైదరాబాద్ లోని ఓ థియేటర్లో వీక్షించారు.
Post a Comment