డొనాల్డ్ ట్రంప్ కు గట్టి ఎదురుదెబ్బ!! | Donald Trump handed defeat as congress overrides his defense Bill
జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా డొనాల్ట్ డ్రంప్ దిగిపోబోతున్నాడు. ఈ క్రమంలోనే ఆయనకు ఘోర అవమానం ఎదురైంది. కీలకమైన రక్షణ బిల్లుపై అభ్యంతరాలు చెబుతూ వీటో ప్రయోగించిన ట్రంప్ కు అమెరికన్ కాంగ్రెస్ గట్టి షాకిచ్చింది.
కాంగ్రెస్ ఆమోదించిన 740 బిలియన్ డాలర్ల డిఫెన్స్ బిల్లుపై వీటో ప్రయోగించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది ఈ బిల్లుకు అమెరికన్ కాంగ్రెస్ భారీ మెజార్టీతో ఆమోదించి ట్రంప్ కు షాకిచ్చింది. అధ్యక్షుడి వీటో అధికారాన్ని తిరగరాసింది.
ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఇలా జరగడం ఇదే తొలిసారి. వీటో అధికారాన్ని తిరగరాసేందుకు ప్రవేశపెట్టిన ఈ బిల్లును సెనేట్ 81-13 ఓట్లతో ఆమోదించింది. విశేషం ఏంటంటే.. ట్రంప్ పార్టీకి చెందిన అధికార రిపబ్లికన్ పార్టీ సభ్యులు కూడా ట్రంప్ కు వ్యతిరేకంగా ఓటు వేయడం గమనార్హం. దీంతో ప్రతినిధుల సభలో ట్రంప్ కు ఈ అవమానం ఎదురైంది.
కాగా ఈ బిల్లుపై ట్రంప్ స్పందించారు. అమెరికా రక్షణ కోసం రూపొందించినట్లుగా లేదని.. రష్యా భారత్ చైనాలకు బహుమతి ఇస్తున్నట్లుగా తయారు చేశారని మండిపడ్డారు. అందుకే వీటాతో అడ్డుకుంటే కాంగ్రెస్ ఆమోదించడం పెద్దతప్పు అని మండిపడ్డారు.
Post a Comment