Header Ads

వాడకం తెలిసిన వాడంటే వీడే .. సులభ్ కాంప్లెక్స్ లో ఆ దుకాణం | That shop in Sulabh Complex

 That shop in Sulabh Complex

మీకు చికెన్ మటన్ కావాలి అంటే ఎక్కడికి వెళ్లారు ? అదేంటి అదేం ప్రశ్న .. చికెన్ మటన్ కావాలి అంటే చికెన్ మటన్ షాప్ కి వెళ్తాము. కానీ ఓ ప్రాంతంలో మాత్రం మటన్ గుడ్ల కోసం సులభ్ కాంప్లెక్స్ వద్దకు వెళ్తున్నారు. అదేంటి మలమూత్ర విసర్జన చేసే కాంప్లెక్స్ లో మటన్ గుడ్లను అమ్మడం కొనడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇదే జరిగింది. ఓ వ్యక్తి నిర్వాకం వల్ల ఈ వింత విచిత్ర సంఘటన జరిగింది. సులభ్ కాంప్లెక్స్ ను నిర్వహించమని ఓ వ్యక్తికి అప్పజెప్పితే అతడు దాన్ని కాస్తా మటన్ గుడ్లు అమ్మే కేంద్రంగా మార్చేసుకున్నాడు.

ఓ వైపు సులభ్ కాంప్లెక్స్ నిర్వహణకు వచ్చే జీతంతోపాటు సొంత వ్యాపారాన్ని కూడా మొదలు పెట్టాడు. మున్సిపాల్టీ అధికారుల చెకింగ్ సమయంలో అడ్డంగా దొరికిపోయాడు. ఇతడి నిర్వాకాన్ని కొందరు మున్సిపాల్టీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఇండోర్ మున్సిపాల్టీ అధికారులు తనిఖీలు చేస్తున్న సమయంలో ఇతడు అడ్డంగా దొరికిపోయాడు. వెంటనే అతడికి వెయ్యి రూపాయల జరిమానా విధించారు. అదే సమయంలో సులభ్ కాంప్లెక్స్ లను నిర్వహించే ఎన్జీవో సులభ్ ఇంటర్నేషనల్ సంస్థకు 20వేల రూపాయల జరిమానాను విధించారు.

సులభ్ కాంప్లెక్స్ లో మటన్ గుడ్ల వ్యాపారం జోరుగా నడుస్తోందన్న వార్తలపై సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడిచింది. నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సులభ్ కాంప్లెక్స్ లో మాంసం అమ్మితే మాత్రం కొనేవాళ్లు ఎలా కొంటున్నారు అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న సదరు వ్యక్తికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.

No comments

Powered by Blogger.