యాంకర్ అనసూయ అక్కడికి కూడా వెళ్తోందటగా..! | Anchor Anasuya is also going there
ప్రస్తుతం స్మాల్ స్క్రీన్ ను ఏలుతున్న యాంకర్లలో ముందువరసలో ఉంటుంది హాట్ బ్యూటీ అనసూయ. అందంతోపాటు అద్బుతమైన టాలెంట్ ఈ అమ్మడి సొంతం. తన టాలెంట్ తో టెలివిజన్ స్క్రీన్ పై సత్తాచాటిన అనసూయ.. ఆ తర్వాత వెండితెరపైనా తన టాలెంట్ చూపిస్తోంది.
తెలుగులో ‘సోగ్గాడే చిన్ని నాయన' ‘క్షణం' ‘రంగస్థలం' ‘యాత్ర' ‘కథనం' వంటి సినిమాల్లో నటించిన రంగమ్మత్త.. ఇతర భాషల్లోనూ తెరంగేట్రం చేయబోతోంది. తమిళ స్టార్ విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న మూవీ ద్వారా కోలీవుడ్ లోకి అడుగు పెడుతోంది అనసూయ. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ షూట్ లో చేరింది అనూ.
కాగా.. త్వరలో మలయాళంలోనూ అరంగేట్రం చేయబోతోందట అనసూయ! మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తున్న మూవీలో ఓ కీలక పాత్ర కోసం అనసూయను సంప్రదించారట మేకర్స్. దీనికి వెంటనే ఓకే చెప్పేసిన అనసూయ.. సైన్ చేసినట్లు కూడా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో అధికారికంగా వెలువడనున్నాయి.
అయితే.. మమ్ముట్టీ అనసూయ ఇదివరకే కలిసి నటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ‘యాత్ర’ సినిమాలో వైఎస్ పాత్రలో మమ్ముట్టి నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో అనసూయ కూడా యాక్ట్ చేసింది. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి నటించబోతున్నారు.
Post a Comment