'లూసిఫర్' రీమేక్ లాంచ్ పై మెగా అప్ డేట్ | Chiranjeevi Lucifer Remake Launch Date
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన సూపర్ హిట్ పొలిటికల్ డ్రామా `లూసిఫర్` తెలుగు రీమేక్ లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సంగతి తెలిసినదే. తని ఒరువన్ (ధృవ-తెలుగు) ఫేం మోహన్ రాజా దర్శకత్వం వహిస్తారని ఇటీవల మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ప్రకటించారు. ఈ ప్రాజెక్టును రామ్ చరణ్.. మెగా డిస్ట్రిబ్యూటర్ కం నిర్మాత ఎన్వీ(తిరుపతి) ప్రసాద్ తో కలిసి నిర్మిస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం.. లూసిఫెర్ రీమేక్ జనవరి 20 నుండి హైదరాబాద్ పరిసరాల్లో తెరకెక్కనుంది. ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తిస్థాయిలో జరుగుతున్నాయి. మొదటి షెడ్యూల్ కు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో వెల్లడించనున్నారని తెలిసింది.
చిరు జనవరి 10 నాటికి ఆచార్య ప్రధాన షెడ్యూల్ ని పూర్తి చేసి మోహన్ రాజా టీమ్ కి అందుబాటులోకి రానున్నారు. లూసిఫర్ రీమేక్ కి ఇంకా టైటిల్ ఫైనల్ కాలేదు. ఈ మూవీ చిత్రీకరణకు వెళ్లేముందు చిరు సంక్రాంతి పండగ కోసం కొన్ని రోజుల విరామం తీసుకుంటారు. మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
Post a Comment