ప్రభాస్ సరసన బీటౌన్ బ్యూటీ.. సలార్ లో తనే! | Happening Bollywood beauty to romance Prabhas in Salaar
బాహుబలితో పాన్ ఇండియన్ స్టార్ గా మారిపోయాడు రెబల్ స్టార్ ప్రభాస్. ఆ సినిమా తర్వాత ప్రభాస్ నటించే ప్రతీ సినిమా పాన్ ఇండియా మూవీగానే తెరకెక్కుతోంది. ఇకనుంచి ఇదే సంప్రదాయం కొనసాగేలా కనిపిస్తోంది. అయితే.. ఆలిండియా అప్పీల్ కనిపించాలంటే.. బీటౌన్ బ్యూటీ కంపల్సరీ అన్నట్టుగా తయారైంది పరిస్థితి. ఈ క్రమంలో ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘సలార్’లోనూ ఓ బాలీవుడ్ బ్యూటీని ఫిక్స్ చేశారట!
అందుతున్న లేటెస్ట్ సమాచారం ప్రకారం.. సలార్ లో ప్రభాస్ సరసన కత్రినా కైఫ్ ను తీసుకోబోతున్నారట. త్వరలోనే ఆమె పేరును అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. బాలీవుడ్ లో కత్రినాకు ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆ క్రేజ్ ను ‘సలార్’ కోసం వాడుకోవడం ద్వారా మరింత హైప్ క్రియేట్ చేయాలని చూస్తోందట యూనిట్. కాగా.. సలార్ లో విలన్ పాత్ర కోసం ఇప్పటికే జాన్ అబ్రహాంను సంప్రదించిన విషయం తెలిసిందే. ఈ విధంగా పాన్ ఇండియా వైడ్ గా అంచనాలు పెంచేయాలనే ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
కాగా.. ఇప్పటికే సాహోలో శ్రద్ధాకపూర్ తో రొమాన్స్ చేశాడు ప్రభాస్. ఇక త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న ‘ఆదిపురుష్’ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రాబోతున్న సైన్స్-ఫిక్షన్ సినిమాలో ‘దీపిక’ పడుకోన్ ను ఫిక్స్ చేశారు. ఇప్పుడు సలార్ కోసం కత్రినాకైఫ్ ను తీసుకోబోతున్నారనే వార్తలు వస్తున్నాయి.
అయితే.. కత్రినాకు టాలీవుడ్ హీరోలు కొత్తేం కాదు. వెంకటేష్ బాలకృష్ణ సరసన ఆమె ఇప్పటికే సినిమాలు చేసింది. ఆ తర్వాత పూర్తిగా బాలీవుడ్ కు పరిమితమైపోయిందీ బ్యూటీ. మళ్లీ ఇన్నాళ్లకు ప్రభాస్ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోందన్నమాట. అయితే.. ఈ విషయం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మరి ఇది నిజమవుతుందా? లేక గాసిప్ లా మిగిలిపోతుందా అన్నది చూడాలి.
Post a Comment