Header Ads

లోన్ యాప్ ల దందా.. వెలుగు లోకి భయంకర నిజాలు | Loan Apps Scams



ఇటీవల వెలుగుచూసిన లోన్ యాప్ల దందాలో భయంకర నిజాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు చైనాకు చెందిన లాంబోను బుధవారం ఢిల్లీలో పోలీసులు అరెస్ట్ చేశారు. లాంబో చైనాకు పారిపోయేందుకు ట్రై చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. అయితే ఈ కేసుకు సంబంధించి పలు భయంకర నిజాలు వెలుగుచూస్తున్నాయి. 4 కంపెనీలు పెట్టి ఈ లోన్యాప్స్ నిర్వహిస్తున్నట్టు సమాచారం. చైనాకు చెందిన లాంబోకు కర్నూలు జిల్లాకు చెందిన నాగరాజు సహకరించినట్టు సమాచారం.

అయితే వీరు కేవలం గత ఆరునెలల్లో 150 లోన్ యాప్స్ ద్వారా దాదాపు రూ. 21 వేలకోట్ల లావాదేవీలు నిర్వహించినట్టు పోలీసుల విచారణలో తేలింది. అయితే పెద్ద మొత్తంలో హవాలా రూపంలో విదేశాలకు డబ్బు తరలించినట్టు సమాచారం. ఉప్పల్కు చెందిన బుమన్నా ప్రసాద్ అనే బాధితుడి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే లోన్యాప్ల వ్యవహారంలో పోలీసులకు షాకింగ్ నిజాలు తెలిసాయి. లోన్యాప్లో నిర్వాహకుల దందా దేశం మొత్తం విస్తరించినట్టు సమాచారం.

 ఈ ముఠా పూణేలో ‘జియా లియాంగ్ ఇన్ఫోటెక్ ’ పేరిట ఓ కాల్ సెంటర్ను నిర్వహిస్తున్నారు. ఈ కంపెనీలో మొత్తం 600 మంది పనిచేస్తున్నట్టు సమాచారం. వారివద్ద నుంచి 101 ల్యాప్టాప్లు 106 సెల్ఫోన్లు స్వాధీన చేసుకున్నారు. అయితే ఇందుకు సంబంధించి మొత్తం 158 యాప్లు గూగుల్ ప్లే స్టోర్లో ఉన్నట్టు సమాచారం. వీటిని తొలగించాలని పోలీస్శాఖ ఇప్పటికే గూగుల్కు లేఖ రాసింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 350 అకౌంట్లలో ఉన్న 87 కోట్ల రూపాయాలను ఈడీ సీజ్ చేసింది. అయితే దేశవ్యాప్తంగా ఈ దందా ఇంతకాలం యథేచ్చగా సాగింది. ఈ యాప్లలో లోన్లు తీసుకొని అనేకమంది మానసిక క్షోభ అనుభవించారు.

No comments

Powered by Blogger.