కరోనా వైరస్ ఫిమేలా ? మగవారిపైనే ఎక్కువ ఫోకస్ పెట్టిందట
కరోనా వైరస్ .. కరోనా వైరస్ .. అసలు ఈ మహమ్మారి కరోనా ఫిమేలా ? అందుకే ఎక్కువగా మగవారికి మాత్రమే సోకుతుందా ?కరోనా భారిన పడి ఇప్పటివరకు దేశంలో ఎంతమంది చనిపోయారు వారిలో మగవారు ఎంతమంది వారిలో ఎక్కువగా ఏ వయస్సువాళ్లు ఉన్నారు కొత్తరకం వైరస్ ఉధృతి దేశంలో ఎలా ఉంది అనే విషయాలని ఒకసారి చూస్తే ..
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మానవజాతిని అత్యంత భయానికి గురిచేసింది ఏదైనా ఉంది అంటే అది కరోనా మహమ్మారినే అని చెప్పాలి. ఇది సృష్టించిన విలయతాండవం అంతా ఇంతా కాదు. దాదాపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ బారినపడి 17 లక్షల 80 వేలమంది మృత్యువాత పడ్డారు. మొత్తం 8కోట్ల 17 లక్షల మంది వైరస్ బారిన పడ్డారు. ఇప్పటి వరకు 46లక్షల 20వేల మంది కరోనా భారిన పడి కోలుకున్నారు. భారత దేశంలో కోటి 2లక్షల మంది కరోనా బారిన పడ్డారు. ఇక లక్షా 47వేల మంది మృత్యువాత పడ్డారు. అయితే కరోనా వైరస్ భారత్లో మహిళలకంటే పురుషులకే ఎక్కువగా సోకింది.
ఈ విషయం కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ లెక్కలు చెబుతున్నాయి. లక్షా 47వేల మంది మృతుల్లో 70 శాతం మంది పురుషులేనని కేంద్రం స్పష్టం చేసింది. కరోనాతో మృతి చెందిన పురుషుల్లో కూడా 60 ఏళ్ల లోపువారు 45 శాతం మంది ఉన్నారు. ఇక మొత్తం కరోనా కేసుల్లో 63 శాతం మంది పురుషులే ఉన్నారు. వారిలో 52 శాతం 18 నుంచి 44 ఏళ్ల వయసు లోపువారు ఉన్నారు. మిగిలిన 11 శాతం పురుషులే మృత్యువాత పడుతున్నారు. ఇకపోతే దేశంలో గత 24 గంటల్లో 21821 మందికి కరోనా నిర్ధారణ అయింది. కొత్తగా 26139 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 10266674కు చేరింది. గడచిన 24 గంటల సమయంలో 299 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 148738కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 9860280 మంది కోలుకున్నారు.
Post a Comment