Header Ads

Allu Arjun - Allu Ayan: చిన్నారి అభిమానుల కోసం అల్లు అర్జున్ ఏం చేశాడో తెలుసా?

 


Allu Arjun - Allu Ayan: స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అనాథ ఆశ్రమంలోని తన చిన్నారి అభిమాని కోరికను అల్లు అయాన్‌ను ద్వారా తీర్చాడు. అక్కడ ఉన్న ఇతర పిల్లలకు కూడా బహుమతులను పంపాడు బన్నీ.


స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ క్రిస్మస్‌, ముక్కోటి ఏకాదశి సందర్భంగా తన చిన్నారి అభిమాని కోరికను నేరవేర్చాడు. ఇంతకీ అల్లు అర్జున్‌ని ఆ చిన్నారి అభిమాని ఏ కోరిక కోరాడు. బిజీగా ఉండే బన్నీ ఆ అభిమాని కోరికను ఎలా నేరవేర్చాడు అనే వివరాల్లోకి వెళితే.. . హైదరాబాద్‌లో ఓ అనాథ ఆశ్రమంలో ఓ చిన్నారికి బన్నీ అంటే ఎంతో ఇష్టం. బన్నీని కలిసి తన ఆటోగ్రాఫ్‌ తీసుకోవాలని అనుకున్నాడు. కానీ బన్నీని కలిసేదెలా? అసలు బన్నీ తనను కలవడానికి ఎందుకు వస్తాడు? అనేది ఆ చిన్నారి మదిలో ఆలోచన. ఈ విషయం అల్లు అర్జున్‌ వరకు చేరింది. అయితే పుష్ఫ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉంటున్న బన్నీ తన ప్రతినిధి తన తనయుడు అల్లు అయాన్‌ను పంపాడు. తన ఆటోగ్రాఫ్‌ చేసిన గిఫ్ట్‌ను అల్లు అయాన్‌ ద్వారా ఆ చిన్నారి ఫ్యాన్‌కు అందించాడు. అంతే కాదండోయ్‌.. ఆ ఆనాథ ఆశ్రమంలోని పిల్లలందరికీ గిఫ్టులను కూడా పంపించి అందరికీ ఆనందాన్ని అందించాడు అల్లు అర్జున్‌. తన అభిమాన హీరో నుండి అనుకున్న గిఫ్ట్‌ దక్కడంతో సదరు చిన్నారి అభిమాని ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అసలు బన్నీ నుండి తనకు గిఫ్ట్‌ వస్తుందని అనుకోలేదని సదరు చిన్నారి తెలిపాడు.

ప్రస్తుతం అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో ప్యాన్‌ ఇండియా చిత్రం పుష్ఫ షూటింగ్‌తో బిజీ బిజీగా ఉన్నాడు. ఇటీవల మారేడు మిల్లిలో పుష్ఫ షూటింగ్‌ను స్టార్ట్‌ చేస్తే.. యూనిట్ సభ్యులకు కరోనా సోకడంతో షూటింగ్‌ను ఆపేసి యూనిట్‌ హైదరాబాద్‌కు చేరుకుంది. ఇప్పుడు మళ్లీ హైదరాబాద్‌లో షూటింగ్‌ను స్టార్ట్‌ చేయడానికి అల్లు అర్జున్‌, సుకుమార్‌, నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారు. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. శేషాచల అడవుల్లో జరిగే ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సినిమాను తెరకెక్కిస్తున్నారు. అల్లు అర్జున్‌ ఈ సినిమాలో పుష్పరాజ్‌ అనే లారీ డ్రైవర్‌ పాత్రలో నటిస్తున్నాడు. వచ్చే ఏడాదిలో సినిమా విడుదల కానుంది.

ఈఏడాది సంక్రాంతికి విడుదలైన 'అల వైకుంఠపురములో' సినిమాతో నాన్‌ బాహుబలి రికార్డులను క్రియేట్‌ చేశాడు బన్నీ. ఇప్పటికీ ఈ సినిమా పాటలు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే ఉన్నాయి. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు వందల కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. 'పుష్ప' సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి మాత్రం చాలా సమయాన్నే తీసుకున్నాడు.

No comments

Powered by Blogger.