Sexual Wellness: సెక్స్ లేకుండా రిలేషన్‌షిప్‌లో ఉండటం సాధ్యమేనా..?
లైంగిక కోరికలు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి. సెక్సువాలిటీలో ఫ్రే సెక్సువల్ వ్యక్తులు ఇతరులకంటే భిన్నంగా కనిపిస్తారు. ఎదుటివారి గురించి పెద్దగా తెలుసుకోకముందే వారిపై కోరికలు కలగడాన్ని ఫ్రే సెక్సువాలిటీ (Fray Sexuality) అంటారు. కానీ ఇద్దరి మధ్య బంధం బలపడుతున్నా కొద్దీ వారిపై కోరికలు తగ్గిపోతాయి. ఇది లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్‌పై ప్రభావం చూపుతుంది. ఫ్రే సెక్సువల్ వ్యక్తులకు బాగా దగ్గరైన భాగస్వామిపై క్రమంగా కోరికలు తగ్గుతాయి. వీరు సెక్స్‌కు ప్రాధాన్యం ఇవ్వకుండా రొమాంటిక్ రిలేషన్‌షిప్‌పై దృష్టిపెట్టడం ద్వారా భాగస్వామి ప్రేమను పొందుతూ, వారితో రిలేషన్‌షిప్‌ను కొనసాగించవచ్చు. రొమాంటిక్ రిలేషన్‌షిప్‌లో సెక్స్ అవసరం లేదని ఇద్దరూ భావించినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది.
సెక్స్ లేకుండానే ఇద్దరి మధ్య రొమాంటిక్ రిలేషన్‌షిప్ ఉండవచ్చు. ఇది ఇద్దరి మధ్య ఉండే లైంగిక సంబంధాలు, భాగస్వామిపై ఉండే కోరికలు, అవగాహనపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ప్రేమలో ఉండే జంటలు, పెళ్లి చేసుకునేవారు ఫ్రే సెక్సువల్‌గా ఉండాలనుకుంటారు. కానీ రిలేషన్‌షిప్‌లో ఉన్నవారిలో ఒకరికి సెక్స్ కావాలనిపించి, మరొకరు వద్దని చెప్పినప్పుడు ఇద్దరి మధ్య తేడాలు వస్తాయి. అందువల్ల ఈ విషయాల గురించి భాగస్వామితో చర్చించి, వారి అభిప్రాయాలను గౌరవించగలగాలి. ఫ్రే సెక్సువల్ వ్యక్తులకు ఇది ఒక సవాలుగా చెప్పుకోవచ్చు.
సెక్స్‌కు దూరంగా ఉండాల్సిందేనా?
ఫ్రే సెక్సువల్ (Fray Sexual) వ్యక్తులు భాగస్వామి కోసం సెక్స్‌కు దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. వారి అనుమతితో ఇతరులతో సెక్సువల్ రిలేషన్‌షిప్ (polyamory) పెట్టుకునే అంశంపై చర్చించాలి. భాగస్వామితో రొమాంటిక్, లాంగ్‌టర్మ్ రిలేషన్‌షిప్ ఉండి, వేరొకరితో సెక్సువల్ రిలేషన్‌షిప్ కోరుకోవడాన్నే పాలిమరీ అంటారు. దీనిపై ఏకాభిప్రాయం వస్తేనే ముందుకు వెళ్లాలి. వేరొకరితో శృంగారాన్ని ఆస్వాదించే అంశంపై ఏకాభిప్రాయం ఉంటే రిలేషన్‌షిప్‌లో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు. రిలేషన్‌షిప్‌లో ఉండే ఇద్దరూ వేరొకరితో పాలిమరీగా ఉండాలనుకుంటే, దానిపైన కూడా ఇద్దరికీ ఏకాభిప్రాయం ఉండాలి.
నమ్మకమే ముఖ్యం...
భాగస్వామితో ఎలాంటి రిలేషన్‌షిప్ కోరుకుంటున్నారనేది ఇద్దరూ కలిసి చర్చించుకోవాలి. ఏదీ దాచకుండా ఉంటేనే ఇద్దరి మధ్య అన్నిరకాల బంధాలు బలపడతాయి. సెక్స్ అవసరం లేకుండా రొమాంటిక్ రిలేషన్‌షిప్ ఎంతవరకు సాధ్యమవుతుందో చర్చించుకోవాలి. ఇద్దరూ ఒకరి అనుమతితో మరొకరు పాలిమరీ రిలేషన్‌షిప్‌ను ఎంచుకొని సెక్స్ కోసం వేరొకరికి దగ్గరవ్వడం వల్ల మీ బంధం ఎంతవరకు నిలబడుతుందో ఆలోచించాలి. ఇవన్నీ తెలుసుకున్న తరువాతే ముందడుగు వేయాలి. భాగస్వామితో ప్రేమే ముఖ్యమనే నిర్ణయానికి వచ్చినవారు ఒకరిపై ఒకరు నమ్మకం ఉంచి రిలేషన్‌షిప్‌ను కొనసాగించడం మంచిది.
Post a Comment