Rashmika Mandanna: 'మిషన్ మజ్ను' ద్వారానే బాలీవుడ్ ఎంట్రీ.. ఎందుకో అసలు కారణం చెప్పిన రష్మిక
కన్నడ బ్యూటీ రష్మిక మందన్న(Rashmika Mandanna) బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న విషయం తెలిసిందే. సిద్ధార్థ్ మల్హోత్రా(Siddharth Malhotra) హీరోగా శాంతాను బాగ్చీ తెరకెక్కిస్తోన్న మిషన్ మజ్ను(Mission Majnu)లో రష్మిక హీరోయిన్‌గా నటించనున్నారు
Rashmika Mandanna: కన్నడ బ్యూటీ రష్మిక మందన్న బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న విషయం తెలిసిందే. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా శాంతాను బాగ్చీ తెరకెక్కిస్తోన్న మిషన్ మజ్నులో రష్మిక హీరోయిన్‌గా నటించనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. పాకిస్థాన్‌లో భారత రా అధికారులు చేసిన ఓ కోవర్ట్ ఆపరేషన్ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. కాగా ఈ సినిమా కంటే ముందే రష్మికకు బాలీవుడ్ ఆఫర్ వచ్చింది. షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కుతోన్న జెర్సీ రీమేక్‌లో మొదటి అవకాశం రష్మికకే వచ్చింది. అయితే కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్ట్‌కి నో చెప్పారు రష్మిక. ఇక తాజాగా మిషన్ మజ్ను చిత్రం తనకెంత ప్రత్యేకమో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఈ నటి.
భాషలకు అనుగుణంగా నా మీద అందరూ చూపిస్తోన్న ప్రేమకు నేను కృతఙ్ఞురాలిని. ఒక నటిగా నాకు సినిమా కథ చాలా ముఖ్యం. ఈ భాషలోనే నటించాలని నేను లిమిట్ ఏం పెట్టుకోలేదు. మిషన్ మజ్నును ఎంతో అద్భుతంగా రాశారు. ఈ సినిమాకు నన్ను సెలక్ట్ చేయడం నిజంగా నా అదృష్టం. ఎంతో పాషన్ ఉన్న ఈ టీమ్‌తో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నా. ఈ మూవీని మేమంతా మరింత స్పెషల్ చేస్తాం. హిందీ సినిమాలో నా జర్నీని ప్రారంభించేందుకు ఎక్సైట్‌గా ఉంది. అలాగే కొత్త ఆడియెన్స్‌కి నేను దగ్గరవ్వబోతున్నా అని రష్మిక చెప్పుకొచ్చారు.

కాగా అటు హిందీ సినిమాకు ఒప్పుకున్నప్పటికీ.. సౌత్‌లోనూ పలు మూవీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రష్మిక. ఈ క్రమంలో ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన పుష్పలో నటిస్తున్నారు ఈ నటి. అలాగే తమిళ్‌లో కార్తీ సరసన రష్మిక నటించిన సుల్తాన్ మూవీ షూటింగ్ ఇటీవల పూర్తి కాగా.. వచ్చే ఏడాది ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
Post a Comment