భార్య బెడ్ రూం నుంచి ప్రియురాలి బెడ్ రూంకు సొరంగం తవ్విన ఘనుడు | The tunnel from the wife bedroom to the girlfriend bedroom
వీడు సామాన్యుడు కాదు రా బాపూ.. ఏకంగా భార్యకు తెలియకుండా పక్కింట్లోనే ప్రియురాలిని పెట్టాడు. ప్రియురాలి భర్తకు సైతం కనిపించకుండా రెండు ఇళ్ల మధ్య సొరంగం తవ్వాడు. చక్కగా అటు భార్యతో.. ఇటుప్రియురాలితో సంసారం చేస్తూ తెగ ఎంజాయ్ చేశాడు. ఈ రెండిళ్ల బాగోతం తాజాగా బయటపడింది.
మెక్సికో దేశంలోని అల్బెర్టో అనే వ్యక్తి తాజాగా తన ఇంట్లో ఉన్న బెడ్రూం నుంచి పొరుగింట్లో ఉన్న ప్రియురాలి ఇంట్లో వరకు ఓ పెద్ద సొరంగం తవ్వాడు. ఆ ప్రియురాలి భర్త సెక్యూరిటీ గార్డ్. అతడు నైట్ డ్యూటీకి వెళ్లిన సమయంలో అల్బెర్టో ఈ సొరంగం తవ్వకం పనులు చేశాడు. అలా రోజూ పని కానిచ్చేస్తున్నాడు.
ఓ రోజు ప్రియురాలి భర్త నైట్ డ్యూటీ నుంచి సగంలో ఇంటికి వచ్చేశాడు. అల్బెర్టో అప్పటికే ప్రియురాలితో సరసాల్లో ఉన్నాడు. ఎలా వచ్చావని చెక్ చేయగా మంచం కింద సొరంగం ఉంది. సొరంగం చూసుకుంటూ వెళ్లగా అల్బెర్టో ఇంటి లోపలికి దారి చూపించింది. దీంతో ఇతగాడి కామ లీలలు బయటపడ్డాయి.
అనంతరం అల్బెర్టోను తీవ్రంగా కొట్టి ఇరుగుపొరుగు వారిని పిలిచి ప్రియురాలి భర్త రచ్చ చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వచ్చి అల్బెర్టోను అరెస్ట్ చేశాడు. సరసాల కోసం సొరంగం తవ్విన ఈ ఘటిక ప్రియుడు కటకటాల పాలయ్యాడు.
Post a Comment