ఆదిపురుష్ లో సీతగా మాజీ మిస్ ఇండియా...
రెబల్ స్టార్ ప్రభాస్ 'ఆదిపురుష్' అనే హిందీ సినిమాలో చేస్తున్నట్లు తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నాడు. రావణాసురిడిగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. కానీ ఇప్పటివరకు ఇందులో ప్రభాస్ పత్ని సీతగా ఎవరు నటించనున్నారు అనేది తెలియదు. మొదట ఆ పాత్రలో కీర్తి సురేష్, కియారా అద్వాణీ నటిస్తుంది అని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు తాజాగా మరో పేరు తెరమీదకు వచ్చింది. ఆమె మాజీ మిస్ ఇండియా(2015) ఊర్వశి రౌటెలాను ఇందులో సీత పాత్ర కోసం సంప్రదిస్తున్నట్లు సమాచారం. ఈ పాత్రకు ఊర్వశి బాగా సరిపోతుందని చిత్రబృందం అనుకుంటున్నట్లు తెలుస్తుంది. కానీ ఇంతవరకు ఈ భామ చేసిన పాత్రలు అన్ని బోల్డ్ వే.. అందాల ఆరబోతకు ఏమాత్రం అడ్డు చెప్పని ఊర్వశిని ప్రభాస్ ఆదిపురుష్ కోసం సంప్రదిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక తానాజీ సినిమా దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాని దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో టీ-సిరీస్ నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమా కంటే ముందు ప్రభాస్ మరో రెండు సినిమాలు చేయనున్నాడు.
Post a Comment