టాప్ 10 తెలుగు సీరియల్ హీరోయిన్స్…ఒక ఎపిసోడ్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.??
తమ మంచితనంతో కుటుంబంలో అందరి కష్టాలను తమ కష్టాలుగా భావించి అన్ని ఇబ్బందులలో ఇరుక్కునే మన తెలుగు బుల్లి తెర హీరోయిన్స్ రెమ్యూనరేషన్ ఎంతో ఓసారి మీరే లుక్ వేయండి.
#1. ప్రేమి విశ్వనాధ్
కార్తీక దీపం సీరియల్ లో అందరికంటే ఎక్కువగా ఫేమస్ అయిన వంటలక్క అసలు పేరు ప్రేమి విశ్వనాధ్ ఈమె ఓ కేరళ అమ్మాయి.అభిమానులతో టచ్ లో ఉండడం కోసం ప్రేమి విశ్వనాధ్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు. ఈమె రెమ్యూనరేషన్ రోజుకి 25,000 రూపాయలు.
#2. పల్లవి రామిశెట్టి
బుల్లితెర అనుష్క గా పేరు పొందిన పల్లవి రామిశెట్టి తెలుగులో ఆడదే ఆధారం సీరియల్ తో పరిచయమైంది.ఈమె రెమ్యూనరేషన్ రోజుకి 15000 వేల రూపాయలు
#3. సమీరా షరీఫ్
అటు యాంకర్ గా ఇటు సీరియల్ లో నటిగా ఫుల్ బిజీగా ఉన్న సమీరా షరీఫ్ రోజుకి 10000 వేల రూపాయిలు రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తుంది.
#4. మంజుల
మంజుల చంద్రముఖి సీరియల్ తో తెలుగువారికి పరిచయమైంది.ఈమె సీరియల్ యాక్టర్ నిరుపమ్ ని పెళ్లి చేసుకుంది.ఒక రోజుకి మంజుల 8000 రూపాయిలు రెమ్యునరేషన్ తీసుకుంటుంది.
#5. సుహాసిని
చంటిగాడు సినిమాతో హీరోయిన్ గా తెలుగు వారికి పరిచయమైన సుహాసిని ఆతరువాత బుల్లితెర మీదకు వచ్చి బాగా బిజీ అయిపోయింది.ఈమె రెమ్యూనరేషన్ రోజుకి 25000 వేల రూపాయలు.ప్రస్తుతం ఈమె తెలుగులో రెండు సీరియల్స్ చేస్తున్నారు.
#6. అషికా
కథలో రాజకుమారి సీరియల్ తో తెలుగు వారి మనసులు దోచిన అషికా ప్రస్తుతం త్రినయని సీరియల్ చేస్తుంది.రోజుకి ఈమె 12,000 రూపాయలు పారితోషికం ఛార్జ్ చేస్తున్నారు.
#7. హరిత
హీరోయిన్ రవళి చెల్లి అయిన హరిత తెలుగులో
వైదేహీ సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయ్యారు.ఎన్నో సూపర్ హిట్ సీరియళ్లలో నటించిన ఈమె ప్రస్తుతం కుంకుమ పువ్వు సీరియల్ లో నటిస్తున్నారు.ఈమె రోజుకి 12,000 రూపాయలు పారితోషికం ఛార్జ్ చేస్తున్నారు.
#8. ప్రీతినిగమ్
అటు సినిమాల్లో ఇటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న సీనియర్ నటి ప్రీతినిగమ్.. ఒక రోజుకి రెమ్యునరేషన్ 10,000 రూపాయలు పారితోషికం ఛార్జ్ చేస్తున్నారు.
#9. నవ్య స్వామి
నా పేరు మీనాక్షి సీరియల్ తో బుల్లితెరకు పరిచయం అయిన నవ్యస్వామి..ప్రస్తుతం ఆమెకథ సీరియల్లో నటిస్తుంది. ప్రస్తుతం నవ్య ఒక రోజుకి 20,000 వేల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారు.
#10. ఐశ్వర్య
అగ్నిసాక్షి సీరియలతో తెలుగు వారికి పరిచయమైన అల్లరి పిల్ల ఐశ్వర్య ఒక రోజుకి 20,000 రూపాయల పారితోషికం తీసుకుంటున్నారు.ముఖ్యంగా ఐశ్వర్య, నవ్యస్వామి ఇద్దరూ వదిన మరదళ్లు అని మీకు తెలుసా? నవ్య అన్నయ్య హరివినయ్ నే ఐశ్వర్య పెళ్లి చేసుకుంది.
Post a Comment