Today Horoscope: అక్టోబరు 13 రాశి ఫలాలు- మనస్సులో కోరికలు నెరవేరుతాయి
జీవితంలో జరగబోయేది తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ముఖ్యంగా రాశిచక్రాల ఆధారంగా జీవితంలో ఎలాంటి మార్పులు రానున్నాయో ముందే అంచనా వేయొచ్చు. ఈ నేపథ్యంలో 2020 అక్టోబరు 13 దినఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
మేషం..
ఈ రోజు మీకు ప్రత్యేకంగా ఉంటుంది. ప్రజల పట్ల మీ ఆలోచన తీరు మారుతుంది. ఒకరి పట్ల మీకున్న ఆకర్షణ పెరుగుతుంది. అంతేకాకుండా ఈ రోజు మీరు తీరిక లేకుండా గడుపుతారు. ఆనందం కూడా పెరుగుతుంది. లాభ-నష్టాలను బేరీజు వేసుకొని జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయమిది. జాగ్రత్తగా ఆలోచించి నూతన పని ప్రారంభిస్తే మంచి జరుగుతుంది. ఈ రోజు మీకు అదృష్టం 80 శాతం మద్దతు ఇస్తుంది.
వృషభం..
ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. మీకు చేసే ప్రతి విషయాన్ని అర్థం చేసుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంపద పరంగా ప్రయోజనం పొందుతారు. వ్యాపారం ఈ రోజు పురోగమిస్తుంది. నూతన ఒప్పందాలు కదుర్చుకుంటారు. ఈ రోజు మీకు అదృష్టం 78 శాతం కలిసి వస్తుంది.
మిథునం..
ఈ రోజు మిథున రాశివారు ఉరుకులు పరుగులు తీయాల్సి ఉంటుంది. భార్య ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. కుటుంబం నుంచి కొద్దిగా దూరంగా ఉండాల్సి వస్తుంది. ఈ రోజు మీకు అనుకోని అతిథులు వస్తారు. ఇది మీకు కొంత అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా కొన్ని కారణాల వల్ల సమస్యలు పెరుగుతాయి. ఈ రోజు మీకు అదృష్టం 55 శాతం మద్దతు ఇస్తుంది.
కర్కాటకం..
ఈ రోజు మీరు సానుకూల ఫలితాలు అందుకుంటారు. ఫలితంగా ఆస్తి లాభం ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు. వ్యాపారం పురోగమిస్తుంది. ఇందుకు ప్రజల నుంచి మద్దతు ఉంటుంది. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. చాలా కాలంగా పూర్తికాని పనిని ఈ రోజు మీరు పూర్తి చేస్తారు. అంతేకాకుండా విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో మీ ప్రేమ పెరుగుతుంది. ఈ రోజు మీకు అదృష్టం 90 శాతం కలిసి వస్తుంది.
సింహం..
మీ ఎదుగుదల్లో అదృష్టం ఈ రోజు కీలక పాత్ర పోషిస్తుంది. శుక్రుడు ఈ రోజు మిమ్మల్ని కలుస్తున్నాడు. ఇది మీ వ్యాపారాన్ని పెంచుతుంది. వైవాహిక జీవితంలో ఆనందం పెరుగుతుంది. వ్యాపారంలో సన్నిహితుడికి నిజమైన విధేయత, సున్నితమైన స్వరాన్ని కలిగి ఉండటం ద్వారా ప్రజల హృదయాలను గెల్చుకుంటారు. పోటీ పరీక్షలో విజయాన్ని సాధిస్తారు. ఆద్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు మీకు అదృష్టం 80 శాతం మద్దతు ఇస్తుంది.
కన్య..
ఈ రోజు కొంతమంది మీ సహాయాన్ని ఆశించవచ్చు. వారికి సాయం చేయడానికి మీరు సిద్ధంగా ఉంటారు. ఈ రోజు ఒకరి నుంచి మరొకరు విషయాలు నేర్చుకుంటారు. ఆధ్యాత్మికతవైపు మీ మనసు మళ్లుతుంది. ఉద్యోగం, వ్యాపార రంగంలో పురోగతి సాధిస్తారు. ఎలాంటి వాదనలు, వివాదాలు లేకుండా నివారించండి. ఈ రోజు ఎవ్వరికి రుణాలు ఇవ్వవద్దు. మీ డబ్బు తిరిగి పొందడంలో ఇబ్బంది ఉండవచ్చు. ఈ రోజు మీకు అదృష్టం 87 శాతం కలిసి వస్తుంది.
తుల..
ఈ రోజు మీకు సంతృప్తికరంగా ఉంటుంది. అన్ని ప్రాంతాల నుంచి మీకు సహాయం లభిస్తుంది. మీ విధికి పూర్తి మద్దతు లభిస్తుంది. ఈ రోజు మీకు బహుమతులు లభిస్తాయి. ఆగిపోయిన పనిని పూర్తిచేయగలుగుతారు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. స్నేహితుడి మద్దతుతో ప్రణాళికలు సరిగ్గా చేయగలుగుతారు. వాటిని అమలు చేయడం గురించి ఆలోచిస్తారు. ఈ రోజు మీకు అదృష్టం 90 శాతం మద్దతు ఇస్తుంది.
వృశ్చికం..
ఈ రోజు పవిత్ర యోగంలో చంద్రుడు ఉండటం వల్ల మీ పనులన్నీ తక్కువ ప్రయత్నంతో సులభంగా ఉంటారు. ఫలితంగా మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. ఈ రోజు బిజీగా ఉండటం వల్ల మీరరు ప్రయోజనం పొందుతారు. నిపుణుల సలహా తర్వాత మీకు ఉపయోగకరంగా ఉంటుంది. మీ విధికి పూర్తి మద్దతు లభిస్తుంది. సాయంత్రం ఇష్టమైన ఆహారాన్ని పొందండం ద్వారా ఆనందంగా ఉంటారు. ఈ రోజు మీకు అదృష్టం 92 శాతం కలిసి వస్తుంది.
ధనస్సు..
ఈ రోజు ధనస్సు రాశివారు సమస్యల నుంచి బయటపడతారు. కోర్టు కార్యాలయంలో మీరు గెలుస్తారు. ఇతర ప్రభుత్వ పనులు కూడా పూర్తవుతాయి. చంద్రుడు స్థానం వల్ల పెద్ద మొత్తంలో డబ్బును సంపాదిస్తారు. ఫలితంగా సంపదను పెంచుకోవచ్చు. మీరు మీ సమస్యను సొంతంగా పరిష్కరించుకుంటారు. అప్పుడే మీ విశ్వాసం పెరుగుతుంది. మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. ఈ రోజు మీకు అదృష్టం 83 శాతం మద్దతు ఇస్తుంది.
మకరం..
మకర రాశివారు ఈ రోజు ఇతరులకు పరోపకారం చేస్తారు. మీ ఇంట్లో ఈ రోజు చెడు భావాలు ఉంటాయి. ఈ రోజు వ్యాపారవేత్తలకు శుభంగా ఉంటుంది. ఈ రోజు మీరు ఇరుక్కున్న చెల్లింపును పొందవచ్చు. షేర్లలో పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన సమయం. లాభం గురించి పూర్తి అంచనా వేస్తారు. మధ్యాహ్నం చెల్లాచెదురైనా మీ వ్యాపారాన్ని ఏకీకృతం చేయాలి. బహుశా ఇందుకు సమయం లేదు. ఈ రోజు మీకు అదృష్టం 87 శాతం కలిసి వస్తుంది.
కుంభం..
కుంభ రాశివారికి ఈ రోజు అదృష్టం కలిసి వస్తుంది. మీ మనస్సులు ఆలోచనలు నెరవేరుతాయి. ఈ రోజు మీ సంపద, కీర్తి పెరుగుతుంది. స్నేహితుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. నలుగురి నుంచి శుభవార్తలు అందుకుంటారు. మీ మనస్సులో ఆనందంగా ఉంటుంది. సంతృప్తికరంగా ఉంటుంది. చాలాకాలంగా పెండింగులో ఉన్న విషయాల్లో విజయం సాధిస్తారు. మీకిష్టమైన వారితో సమావేశమవుతారు. ఈ రోజు మీకు అదృష్టం 90 శాతం మద్దతు ఇస్తుంది.
మీనం..
ఈ రోజు మీరు శుభఫలితాలు అందుకుంటారు. పిల్లల వివాహం విషయం ముందుకు సాగవచ్చు. ఈ రోజు విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు శుభకరమైన కార్యాలు చేస్తారు. ఇది మీ అదృష్టాన్ని పెంచుతుంది. ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆసక్తి ఉంటుంది. రాత్రి సమయంలో కుటుంబంతో గడపడం మంచిది. ఈ రోజు మీకు అదృష్టం 80 శాతం కలిసి వస్తుంది.
Post a Comment