Header Ads

అమితాబ్ రిజెక్ట్ చేసిన తెలుగు సినిమాలు ఏంటో తెలుసా.? అన్నీ సూపర్ హిట్టులే.!

 చాలా సినిమాల్లో కొన్ని పాత్రలకి మొదట వేరే నటులని అనుకుంటారు. కానీ తర్వాత చాలా కారణాల వల్ల వాళ్ళ స్థానంలో మరొకరు నటిస్తారు. ఇలా కొన్ని వేల సినిమాల్లో ముందు ఆ పాత్ర కోసం అనుకున్నవాళ్ళు తర్వాత ఆ పాత్ర చేయకపోవచ్చు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా అలాగే తెలుగులో అంతకుముందు కొన్ని సినిమాలు చేయాల్సి ఉందట. కానీ తర్వాత కుదరక చేయలేదట.


పూరి జగన్నాథ్, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ పోకిరి సినిమాలో ఒక పాత్రకు ముందుగా అమితాబ్ బచ్చన్ ని అనుకున్నారు. కానీ అమితాబ్ బచ్చన్ కి డేట్స్ ఖాళీ లేకపోవడంతో ఆ పాత్ర చేయలేదట. ఆ పాత్ర ఏంటన్నది బయటకి చెప్పలేదు. కానీ మనమే ఒక్కసారి ఆలోచిస్తే, అమితాబ్ బచ్చన్ అంటే కచ్చితంగా సినిమాలో ముఖ్యమైన పాత్ర అయ్యుండొచ్చు.

పోకిరి సినిమాలో మూడు ముఖ్యమైన పాత్రలు ఉంటాయి. అందులో ఒకటి నాజర్ పాత్ర, మరొకటి ప్రకాష్ రాజ్ పాత్ర, మూడవది సాయాజీ షిండే పాత్ర. ఇందులో నాజర్ పాత్రకి, ప్రకాష్ రాజ్ పాత్ర కి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది.

ఒకవేళ ఈ రెండు పాత్రల్లో ఏదైనా ఒక పాత్రకి అమితాబ్ బచ్చన్ గారిని సంప్రదించి ఉండొచ్చు. ఒకవేళ లేదు అంటే అంతకుముందు అమితాబ్ బచ్చన్ కోసం పాత్ర డిజైన్ చేసి, తర్వాత ఆ పాత్రని మార్చేసి లేదా రిమూవ్ చేసి ఉండొచ్చు.

ఇంక రెండవ సినిమా బాహుబలి. ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర కోసం రాజమౌళి అమితాబ్ బచ్చన్ ని అనుకున్నారు. కానీ ఆ పాత్రని రిజెక్ట్ చేశారు అమితాబ్ బచ్చన్. తెలుగులో మనం సినిమా లో గెస్ట్ అప్పియరెన్స్ లో కనిపించారు అమితాబ్ బచ్చన్. తర్వాత సైరా నరసింహారెడ్డి లో ముఖ్య పాత్ర పోషించారు.

ఇప్పుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ఇంకా దీపికా పదుకొనే నటిస్తున్న  సినిమాలో అమితాబ్ బచ్చన్ ఒక ఫుల్ లెంత్ రోల్ చేస్తున్నారు అని సోషల్ మీడియా ద్వారా అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు నాగ్ అశ్విన్.

No comments

Powered by Blogger.