Header Ads

లిక్కర్ తాగించి Hyd హోటల్‌లో యువతిపై రేప్.. ఆమె ఫోన్‌కు న్యూడ్ వీడియోలు

 Banjara Hills: పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రజక్త అనే యువతి క్రిష్ణ చౌదరి ద్వారా బాధితురాలికి ముంబయిలో పరిచయమైంది. అన్షూ కుక్రేజా అనే వ్యక్తి తనను వేధిస్తున్నాడని.. అతని కంట పడకుండా బాధితురాలి ఇంట్లో ఉంటానని ప్రజక్త కోరింది.

 
ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో దారుణం చోటుచేసుకుంది. ముంబయికి చెందిన ఓ యువతికి బలవంతంగా మద్యం ఇచ్చి ఓ కామాంధుడు అత్యాచారం చేశాడు. ఈ ఘటన అత్యంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత మే నెలలో ఈ ఘటన జరిగింది. అప్పుడే బాధితురాలు ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాజాగా వాట్సప్‌ ద్వారా నిందితుడు బాధితురాలికి న్యూడ్‌ వీడియోలు పంపించి బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు మరోసారి ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు జుబేర్, ప్రజక్త, స్వీటీలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసు
బంజారాహిల్స్ పీఎస్‌కు బదిలీ అయింది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రజక్త అనే యువతి క్రిష్ణ చౌదరి ద్వారా బాధితురాలికి ముంబయిలో పరిచయమైంది. అన్షూ కుక్రేజా అనే వ్యక్తి తనను వేధిస్తున్నాడని.. అతని కంట పడకుండా బాధితురాలి ఇంట్లో ఉంటానని ప్రజక్త కోరింది. ప్రజక్త రిక్వెస్ట్‌ను అంగీకరించిన బాధితురాలు ఆమెకు తన ఇంట్లో ఆశ్రయం కల్పించింది. ఇదిలా ఉండగా మే10న స్వీటీ అనే యువతి ప్రజక్తకు ఫోన్‌ చేసి హైదరాబాద్‌లో జుబేర్‌ అనే మిత్రుడి బర్త్‌డే పార్టీ ఉందని తప్పక రావాలని ఆహ్వానించింది. ఇలా మే11న బాధితురాలు, ప్రజక్త కలిసి హైదరాబాద్‌కు వచ్చారు. హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ హోటల్‌లో బస చేశారు. అదే రోజు రాత్రి స్వీటీ, జుబేర్‌లు హోటల్‌కు వెళ్లి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ నిర్వహించారు. అనంతరం జుబేర్‌, ప్రజక్త, స్వీటీలు కలిసి బాధితురాలికి బలంవంతగా మద్యం తాగించారు. తర్వాత జుబేర్‌ బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడి స్వీటీతో కలిసి హోటల్‌ నుంచి వెళ్లిపోయాడు.

కాగా, మే14న ముంబయికి చేరుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించి జుబేర్‌పై కేసు నమోదు చేసింది. అయితే తాజాగా బాధితురాలు బట్టలు మార్చుకునేటప్పుడు వీడియోలు తీసిన జుబేర్‌ ఆమెకు వాట్సాప్‌ ద్వారా పంపించాడు. కేసు వాపసు తీసుకోవాలని లేకుంటే వీడియోలు యూట్యూబ్‌లో పెడతానంటూ బాధితురాలికి ఫోన్‌ చేసి బెదిరించాడు. దీనిపై మరోసారి బాధితురాలు ముంబయి పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు జుబేర్‌తో పాటు ప్రజక్త, స్వీటీలపై ఫిర్యాదు చేసింది. అయితే ఈ ఘటన హైదరాబాద్‌లో జరగడంతో ముంబయి పోలీసులు బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు కేసు బదిలీ‌ చేశారు. హైదరాబాద్ పోలీసులు నిందితుల కోసం వెతుకుతున్నారు.

No comments

Powered by Blogger.