Header Ads

Pooja Hegde: మోడ్రన్ దుస్తుల్లో బుట్టబొమ్మ.. పూజా హెగ్డేకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గిఫ్ట్

 

ఈ రోజు పూజా హెగ్డే పుట్టినరోజు సందర్భంగా ఆమెకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' టీమ్. ఈ పోస్టర్‌లో మోడ్రన్ దుస్తుల్లో కనిపిస్తూ యమ ఆకట్టుకుంటోంది పూజా.

 
పూజా హెగ్డేకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గిఫ్ట్
నేడు (అక్టోబర్ 10) టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరోవైపు ఆమె 30వ జన్మదినాన్ని పురస్కరించుకొని.. పూజా కొత్త సినిమాల్లోని కొత్త పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగా నేటి ఉదయం `రాధే శ్యామ్` మూవీ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేయగా.. తాజాగా ఆమె మరో న్యూ మూవీ `మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్` నుంచి కూడా పూజా లుక్‌తో కూడిన పోస్టర్‌ విడుదల చేశారు.
అందాల పూజా హెగ్డేకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` టీమ్ ఈ పోస్టర్‌ రిలీజ్ చేసింది. ఇందులో కాలేజ్‌కి వెళ్లే మోడ్రన్ అమ్మాయిగా యమ స్టైలిష్‌గా కనిపిస్తోంది పూజా. ఈ లుక్ చూసి మోస్ట్ ఎలిజిబుల్ లేడీ బ్యాచిలర్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.

అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తుండగా.. పూజా గ్లామర్ బ్యూటీగా కెమెరా ముందుకొచ్చింది. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు. అఖిల్ కెరీర్ టర్న్ అయ్యేలా ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ అతిత్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీపై అక్కినేని అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారు.

No comments

Powered by Blogger.