Header Ads

6 సిక్సులు బాదిన ABD సైలెంట్.. ఒక్క ఫోర్ కొట్టి కోహ్లి సంబరాలు.. ట్విట్టర్లో ఓ రేంజ్‌లో..

 

Kolkata Knight Ridersతో మ్యాచ్‌లో 19వ ఓవర్లో ఒక్క సిక్స్ బాదిన కోహ్లి సంబరాలు చేసుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆరు సిక్సులు కొట్టిన డివిలియర్స్ సైలెంట్‌గా ఉంటే.. కోహ్లి సంబరాలు చేసుకుంటున్నాడంటూ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.

 
kohli | Image: Screengrab of hot star
ఐపీఎల్ 2020లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆకట్టుకుంటోంది. ఏడు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు సాధించిన ఆర్సీబీ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. సోమవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి సేన 82 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 2 వికెట్ల నష్టానికి 194 రన్స్ చేయగా.. బదులుగా కోల్‌కతా 9 వికెట్ల నష్టానికి 112 పరుగులు మాత్రమే చేసింది.
ఈ మ్యాచ్‌లో 5 ఫోర్లు, 6 సిక్సులు బాదిన మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ 33 బంతుల్లోనే 73 రన్స్‌తో నాటౌట్‌గా నిలవగా.. మరో ఎండ్‌లో కోహ్లి 28 బంతుల్లో 33 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి స్ట్రైక్ రేట్ 117.86 కాగా.. డివిలియర్స్ 221కిపైగా స్ట్రైక్ రేట్‌తో రన్స్ చేయడం విశేషం.
ఫించ్ (37 బంతుల్లో 47; 4x4, 1x6), పడిక్కల్ (23 బంతుల్లో 32; 4x4, 1x6)తో పోలిస్తే ఈ మ్యాచ్‌లో కోహ్లి స్లోగా బ్యాటింగ్ చేశాడు. నాన్ స్ట్రైకర్స్ ఎండ్ నుంచి డివిలియర్స్ ఆటను ఆస్వాదించిన విరాట్.. ఈ మ్యాచ్‌లో ఒకే ఒక్క ఫోర్ కొట్టాడు. అది కూడా 19 ఓవర్లో కావడం గమనార్హం. దూకుడుగా ఆడే కోహ్లి.. ఈ మ్యాచ్‌లో బౌండరీ కొట్టడానికి 25 బంతులు తీసుకున్నాడు.
ప్రసిధ్ కృష్ణ వేసిన ఇన్నింగ్స్ 18.3వ ఓవర్లో కోహ్లి ఫోర్ కొట్టాడు. అది కూడా బ్యాట్ ఎడ్జ్ తీసుకొని బంతి బౌండరీకి వెళ్లింది. అయినప్పటికీ.. కోహ్లి సంబరాలు చేసుకోవడం విశేషం. దీంతో ఒక్క ఫోర్ కొట్టి సంబరాలు చేసుకుంటే... మరి 5 ఫోర్లు, ఆరు సిక్సులు బాదిన డివిలియర్స్ ఏం చేయాలంటూ ఫ్యాన్స్ కోహ్లిని ట్రోల్ చేస్తున్నారు.

No comments

Powered by Blogger.