Header Ads

షాకింగ్.. మహిళ మెదడులో గుడ్లు, తలనొప్పితో హాస్పిటల్‌కు వెళ్తే..

 

Image Credit: The American Journal of Tropical Medicine and Hygiene
 మహిళ తీవ్రమైన తలనొప్పితో బాధపడుతోంది. ఎన్ని మందులు మింగినా తగ్గడం లేదు. దీంతో ఆమె వైద్యులను సంప్రదించింది. ఆమెకు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఆశ్చర్యపోయారు. ఆమె మెదడులో చిన్న చిన్న గుడ్లు ఉన్నట్లు గుర్తించారు. సెప్టెంబరు 21న ‘ది అమెరికన్ జర్నల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ అండ్ హైజీన్’లో బాధితురాలికి సంబంధించిన స్టడీ వివరాలను ప్రచురించారు. అందులో పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి.
ఆస్ట్రేలియాకు చెందిన 25 ఏళ్ల మహిళకు ఎదురైన చేదు అనుభవం ఇది. తీవ్రమైన తలనొప్పితో హాస్పిటల్‌లో చేరిన ఆమెకు వైద్యులు అన్నిరకాల పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మెదడులో చిన్న చిన్న లార్వా సైజు గుడ్లు ఉన్నట్లు గుర్తించారు. వాటిని పరీక్షించగా.. టేప్ వార్మ్‌ అనే పురుగుకు సంబంబంధించిన లార్వాలని తెలిసింది.

బాధితురాలు సుమారు ఏడేళ్లుగా తలనొప్పితో బాధపడుతోంది. దీంతో ఆమెకు మైగ్రేన్ సమస్య ఉందని భావించి వైద్యులు చికిత్స అందించారు. అయితే, గత వారం రోజులుగా ఆమెకు ఆగకుండా తలనొప్పి వస్తోంది. ఏ మందులు వేసుకున్నా తగ్గలేదు. చివరికి చూపు కూడా కోల్పోయింది. వస్తువులన్నీ మసకగా కనిపించడం మొదలైంది. దీంతో వైద్యులు ఆమెకు మెదడుకు MRI నిర్విహించారు.

వైద్యులు తొలుత ఆమె మెదడులో కణితి పెరుగుతోందని భావించారు. అదే ఆమె తలనొప్పికి కారణం కావచ్చని అనుకున్నారు. ఊహించినట్లే ఆమె మెదడులో ఒక చొట కణితిలాంటిది కనిపించింది. దీంతో ఆమెకు ఆపరేషన్ చేసి దాన్ని తొలగించేందకు ప్రయత్నించారు. అయితే, వైద్యుల అంచనా తప్పైంది. అది కణితి కాదని, టేప్ వార్మ్‌ గుడ్లు అని తెలుసుకున్నారు.

వైద్య పరిభాషలో ఈ పరిస్థితిని ‘న్యూరోసిస్టిసెర్కోసిస్ - Neurocysticercosis’ అని అంటారని, నాడీ వ్యవస్థలో పరాన్నజీవుల వల్ల ఇది ఏర్పడుతుందని వైద్యులు తెలిపారు. టేప్ వార్మ్‌లు సాధారణంగా పూర్తిగా ఉడకని వంటల కారణంగా శరీరంలోకి చేరుతాయని వైద్యులు తెలిపారు. ముఖ్యంగా పంది మాంసం తినేవారిలో ఈ సమస్య ఎక్కువ. అలాగే ఉడికీ ఉడకని మాంసం, పచ్చి మాంసం తినేవారిలో టేప్‌వార్మ గుడ్లు లేదా పురుగులు రక్తంలో కలిసి మెదడుకు చేరతాయి. కొన్ని టేప్ వార్మ్‌లు చికిత్స అవసరం లేకుండా వాటికవే వెళ్లిపోతాయి. కొన్ని మాత్రం ఇలాంటి ప్రమాదక సమస్యలను తెచ్చి పెడతాయి.


బాధిరాలిలో లక్కీగా టేప్ వార్మ్ గుడ్ల వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్ ఏర్పడలేదు. వాటిని తొలగించిన తర్వాత ఆమె సాధారణ స్థితికి చేరుకుందని ఆ స్టడీలో పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆమెకు మరే ఇతర చికిత్సలు అవసరం లేదన్నారు. కొద్ది రోజుల కిందట థాయ్‌లాండ్‌కు చెందిన ఓ వ్యక్తి మల విసర్జన చేస్తుండగా.. వెనుక నుంచి 17 అడుగుల పురుగు బయటకు వచ్చింది. ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ కింది కథనాన్ని క్లిక్ చేసి చూడండి.

No comments

Powered by Blogger.