పచ్చిమిర్చి తింటే డయాబెటీస్ తగ్గుతుందా? ప్రయోజనాలేమిటీ?
❤ బరువు ఎక్కువగా ఉన్నవారు మిర్చిని తిన్నట్లయితే డయాబెటీస్ దరిచేరదట.
❤ జీరో క్యాలరీలు ఉన్నా పచ్చిమిర్చిని తీసుకోవడం వల్ల షుగర్ సమస్య ఉండదట.
❤ పచ్చిమిర్చిని తిన్న తర్వాత శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుందని, రక్తంలో చక్కెర స్థాయిలు 60 శాతం వరకు తగ్గుతాయని పరిశోధకులు తెలిపారు.
❤ మిర్చీలో ఉండే విటమిన్ A, విటమిన్ B6, కాపర్, ఐరన్, నియాసిన్, పొటాషియం, ఫైబర్ ఫోలేట్‌లు శరీరానికి రక్షణ కల్పిస్తాయి.
❤ పచ్చిమిర్చిలోని యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ నుంచి రక్షిస్తాయి.
❤ ప్రొస్టేట్ గ్రంథి సమస్యలకూ పచ్చిమిర్చి మంచి మందులా పనిచేస్తుందట.
❤ మిర్చీలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సమస్యలను దూరం చేస్తాయి.
❤ ముక్కు దిబ్బడ సమస్యను కూడా మిర్చీ పరిష్కరిస్తుందట. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి.
❤ మిర్చీలో ఉండే విటమిన్ A, విటమిన్ C.. కళ్లు, చర్మానికి మేలు చేస్తాయట.
❤ ఐరన్ లోపం ఉన్నవారు కూడా మిరపని రెగ్యులర్‌గా తీసుకోవచ్చట. సమస్యలు దూరం అవుతాయి.
❤ మిర్చీ రక్తంలోని కొవ్వు, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గించి గుండె సమస్యలు రాకుండా రక్షిస్తుంది.
❤ హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటి సమస్యలు దరిచేరవని నిపుణులు చెబుతున్నారు.
❤ ఇక మిర్చీరి రోజూ తిన్నట్లయితే.. జీర్ణక్రియ మెరుగవుతుందట.
❤ పచ్చిమిర్చిలో ఉండే విటమిన్-C రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
❤ మిర్చీ శరీరంలో కొవ్వును కూడా తగ్గిస్తుందట. కాబట్టి, బరువు తగ్గాలంటే.. డైట్‌లో మిర్చీని చేర్చుకోండి.
❤ మిర్చీలోని కేప్సైసిన్ జీవక్రియను మెరుగుపరుస్తుంది.
❤ మిర్చీ శరీరంలో ఉండే గోధుమ, తెలుపు రంగు రకాల కొవ్వులను తగ్గిస్తుందట.
❤ వ్యాయమం లేకుండానే బరువు తగ్గేందుకు మిర్చీ ఉపయోగపడుతుందట.
❤ మిర్చీ వల్ల మెదడులోని హైపోథాలమస్ ప్రేరణకు గురవ్వుతుంది. ఫలితంగా శరీర ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది.
❤ మిర్చీ అజీర్తి సమస్యను కూడా పరిష్కరిస్తుంది.
❤ రక్త స్రావం సమస్యలను సైతం మీర్చి అడ్డుకుంటుందట.
❤ కీళ్ల నొప్పులను తగ్గించడంలో మిర్చీ పనిచేస్తుందట.
❤ దెబ్బ తగిలినప్పుడు కారే రక్తాన్ని కూడా తగ్గించే శక్తి కారానికి ఉన్నట్లు చెబుతున్నారు నిపుణులు.
❤ మిర్చీ ఘాటును భరించలేమని భావించేవాళ్లు క్యాప్సికమ్ తినొచ్చని చెబుతున్నారు. వీటిలో కూడా సుమారు మిర్చీ గుణాలే ఉంటాయట.
❤ శరీరానికి మేలు చేస్తుంది కదా అని మిర్చీని ఎక్కువగా తినేయకండి. అది కొత్త సమస్యలకు దారి తీయొచ్చు. అతి ఎప్పటికీ అనార్థమే.
Read Also: హోం మేడ్ మాస్క్‌లు ఉత్తమమైనవే: స్టడీ
గమనిక: పైన పేర్కొన్న అంశాలన్నీ వివిధ పరిశోధనలు, హెల్త్ న్యూస్ ఆధారంగా కేవలం మీ అవగాహన కోసమే అందించామని గమనించగలరు. ఇలాంటి డైట్ మీరు పాటించాలని చెప్పడం లేదు. వీటిని మీరు డైట్‌గా తీసుకోవాలంటే తప్పకుండా వైద్యులను సంప్రదించాలి. కొందరి శరీరం తత్వం, వ్యాధులు, అలర్జీల వల్ల రియాక్షన్ చూపించే ప్రమాదం ఉంది. కాబట్టి.. వైద్యుల సలహా మీరకే వీటిని డైట్‌లో చేర్చోవాలని మనవి.
Post a Comment