హోం మేడ్ మాస్క్‌లు ఉత్తమమైనవే: స్టడీ
Home Made masks: కరోనా మహమ్మారి నేపథ్యంలో మాస్క్‌ల వినియోగానికి భారీగా డిమాండ్ వచ్చింది. కరోనా బారిన పడకుండా ఉండేందుకు మాస్క్ ధరించాలంటూ వైద్యులు, శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది బయట మాస్క్‌లు కొంటుండగా.. మరికొందరు ఇళ్లలోనే వస్త్రంతో తయారుచేసుకుంటున్నారు. అయితే అవి ఎంతవరకు సురక్షితం..? వైరస్ కణాలను అడ్డుకోవడంలో ఇవి సమర్థవంతంగా పనిచేస్తాయి..? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ పరిశోధకులు హోం మేడ్ మాస్క్‌ల గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మార్కెట్లో లభించే వివిధ రకాల మాస్క్‌ల కంటే సింగిల్ లేయర్‌వి అయినా ఇంట్లో తయారు చేసుకున్న మాస్కులే ఉత్తమమైనవని తెలిపారు.
ఎదుటి వ్యక్తి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు నీటి తుంపరలు మనల్ని చేరకుండా ఆపడంలో కీలక పాత్ర పోషిస్తాయని వారు వెల్లడించారు. సాధారణ క్లాత్‌తో తయారుచేసిన మాస్క్‌లకు ఇవి ఏ మాత్రం తీసిపోవని, పైగా గాలి పీల్చుకోవడంతో పాటు అత్యంత సౌకర్యవంతంగా ఉంటాయని తెలిపారు. ఈ మేరకు జర్నల్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ మెకానిక్స్ లెటర్స్ అధ్యయనంలో ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలను పేర్కొన్నారు.
దీని గురించి అధ్యయనంలో పాల్గొన్న తాహిర్ సైఫ్ మాట్లాడుతూ.. నీటి తుంపరలను వదిలి, వివిధ రకాల ఫ్యాబ్రిక్‌లను అడ్డుపెట్టి పరిశీలించినప్పుడు ఇంట్లో ఉపయోగించే వస్త్రాలు సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు గుర్తించాం. ఇంకా శ్వాస పీల్చుకున్నప్పుడు అసౌకర్యం కలిగించే మాస్క్‌ల వలన ఊపిరికి కష్టమవ్వడమే కాకుండా, వైరస్ కణాలు కూడా లీకయ్యే అవకాశం ఉంది” అని చెప్పుకొచ్చారు.
Post a Comment