కాజల్ పెళ్లి ముహూర్తం ఫిక్స్.. అఫీషియల్‌గా ప్రకటించిన నటి
![]()
కాజల్ అగర్వాల్
తన సినీ ప్రయాణంలో మద్దతుగా నిలిచిన అందరికీ కాజల్ ధన్యవాదాలు తెలిపింది. ఇకముందు కూడా తనపై ఆదరాభిమానాలు చూపిస్తారని ఆకాంక్షించింది. గౌతమ్ కిచ్లు, కాజల్ మధ్య కొంతకాలం క్రితం ఏర్పడిన స్నేహం ప్రేమగా మారిందని, ఇరు కుటుంబాల సమక్షంలో నిశ్చితార్థం కూడా జరిగినట్లు సమాచారం. ఇప్పుడు కాజలే తన పెళ్లి తేదీని స్వయంగా ప్రకటించడం విశేషం.
‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన కాజల్ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది. ‘మగధీర’ సినిమా ఇచ్చిన బ్రేక్‌తో వెనుదిరిగి చూసుకోలేదు. అందంతో పాటు అభినయం కలగలిపిన ఈ బ్యూటీ రామ్‌చరణ్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి స్టార్స్‌తో నటించి అగ్ర స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య, కమల్ హాసన్‌తో ఇండియన్ 2 లాంటి భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తోంది. మంచు విష్ణుతో మోసగాళ్లు సినిమాతో పాటు, బాలీవుడ్‌లో జాన్ అబ్రహాంతోనూ నటిస్తోంది.
Post a Comment