ఇండియన్ క్రికెట్ కు టాప్ ఫ్యాన్స్ వీళ్లే.! గేమ్ ఎక్కడున్న హడావుడి అంతా వీళ్లదే!
ఇండియాలో క్రికెట్ ఒక మతం…అంతలా ఆదరిస్తారు ఇక్కడి జనం.! సాధారణంగానే క్రికెటర్స్ కు జనాల్లో ఎక్కువ ఫాలోయింగ్ ఉంటుంది! ఫ్యాన్స్ లో కూడా టాప్ ఫ్యాన్స్ ఉంటారు.! అలాంటి ముగ్గురు టాప్ ఫ్యాన్స్ గురించి ఇక్కడ చెప్పబడింది…వాళ్లెవరో, వాళ్లు ఎవరికి ఫ్యాన్సో….ఇప్పుడు చూద్దాం!
సుధీర్ కుమార్ :
బీహార్ కు చెందిన సుధీర్ కుమార్ చౌదరి వృత్తి పరంగా టీచర్. తను క్రికెట్ కు అభిమాని. సచిన్ కు వీరాభిమాని. అందుకే అయన ఇండియాలో ఆడే ప్రతి మ్యాచ్ కు హాజరయ్యేవాడు. విదేశాల్లో జరిగే కొన్ని మ్యాచ్ లకు కూడా క్రికెట్ అభిమానుల నుండి విరాళాలు సేకరించి మరీ వెళ్ళేవాడు.ఈ విషయం తెలిసిన సచిన్ తన వీరభిమానికి ఏదైనా చేయాలని….సుధీర్ కు ఇండియా ఆడే ప్రతి మ్యాచ్ ఉచితంగా చూసే వీలు కల్పించాడు.
Advertisement
చారులత పటేల్ :
చారులత పటేల్ అనే 87 ఏళ్ల వృధారాలు విరాట్ కోహ్లీకి అభిమాని. 2019 లో ఇంగ్లాండ్ లో జరిగిన వరల్డ్ కప్ లో కోహ్లీని చూడటానికి వచ్చిన ఆవిడ మీడియా పుణ్యాన బాగా ఫేమస్ అయ్యారు.ఆతరువాత 2019 వరల్డ్ కప్ లో భారత్ ఆడిన ప్రతి మ్యాచ్ లో ఈమె వచ్చారు.
రాంబాబు :
మొహాలీకి చెందిన రాంబాబు ధోని ఫ్యాన్! ధోని ఆడే ప్రతీ మ్యాచ్ కు హాజరై…తన ఒంటిపై ధోని పేరుని త్రివర్ణ పతాక రంగులను రాసుకొని సందడి చేస్తాడు!
Post a Comment