మాంసంతో తయారు చేసిన డ్రెస్… అక్షరాలు 73 లక్షలు.! వివాదాలకు కారణమైన బీఫ్ డ్రెస్!
ఎంటీవీ వీడియో మ్యూజిక్ అవార్డులు.. లేదా ఇతర అలాంటి ఏ వేడుకలో అయినా సరే.. పాప్ స్టార్స్.. హాలీవుడ్ స్టార్స్ అదిరిపోయే డ్రెస్సులు ధరించి వస్తారు. దీంతో మీడియా కళ్లన్నీ సహజంగానే వారిపై ఉంటాయి. ఈ క్రమంలో కొన్ని రోజుల పాటు వారు ధరించిన డ్రెస్‌పైనే మీడియాలో వార్తలు వస్తుంటాయి. పాపులారిటీ, పబ్లిసిటీ కోసమే తారలు ఇలా చేస్తుంటారు. అయితే అప్పట్లో ప్రముఖ పాప్ సింగర్ లేడీ గాగా ధరించిన ఓ డ్రెస్‌పై దుమారం చెలరేగింది. ఆమె బీఫ్ తో తయారు చేసిన ఓ డ్రెస్‌ను ధరించింది. అయితే అది నిజంగానే మాంసంతో తయారు చేసిందా, లేక కేవలం.. కృత్రిమంగా తయారు చేసిందా..? అన్న విషయంపై అప్పట్లో అనేక మందికి సందేహం ఉండేది. కానీ దానిపై తాజాగా స్పష్టత వచ్చింది.
Advertisement
2010 ఎంటీవీ వీడియో మ్యూజిక్ అవార్డులలో ప్రముఖ అమెరికన్ పాప్ సింగర్ లేడీ గాగా ఏకంగా 8 అవార్డులను సాధించింది. అయితే ఆ వేడుకకు ఆమె బీఫ్ డ్రెస్‌ను వేసుకొచ్చింది. దానిపై అప్పట్లో పెద్ద దుమారమే చెలరేగింది. జంతు హక్కుల సంఘం కార్యకర్తలు, సామాజిక కార్యకర్తలు, వెజ్ ప్రియులు నిరసన వ్యక్తం చేశారు. అయితే అసలు ఆ డ్రెస్‌ను నిజంగానే మాంసంతో డిజైన్ చేశారా, లేదా.. అన్న వివరాలు అప్పట్లో తెలియలేదు. కానీ ఆ డ్రెస్‌ను నిజంగానే మాంసంతో తయారు చేశారని తాజాగా వెల్లడైంది. అక్కడి ఫ్రాంక్ ఫెర్నాండెజ్ అనే డిజైనర్ ఆ డ్రెస్‌ను రూపొందించాడు. దాన్నే లేడీ గాగా ధరించింది. ఈ క్రమంలో ఆ డ్రెస్‌ను నిజంగానే మాంసంతో తయారు చేశారని తాజాగా నిర్దారణ అయింది.
అయితే ఆ డ్రెస్‌ను ప్రస్తుతం ఒక చోట ఉంచి దాన్ని ఎగ్జిబిషన్ పెట్టారు. దీంతో మరోసారి ఆ డ్రెస్ వివాదాస్పదమవుతోంది. అయితే కొందరు డిజైనర్లు అచ్చం అలాంటి డ్రెస్‌నే కృత్రిమంగా రూపొందించి వాటిని ఒక్కక్క దాన్ని 1 లక్షడాలర్లకు (దాదాపుగా రూ.73,29,400) విక్రయిస్తున్నారు. దీంతో ఆ డ్రెస్‌లను కూడా జనాలు కొంటున్నారు. ఆ డ్రెస్‌లను మాంసంతో చేయకపోయినా వాటికి ఆదరణ లభిస్తోంది. అయితే అప్పట్లో లేడీ గాగా ధరించిన ఆ డ్రెస్ మాంసంతో చేసిందని తెలియడంతో ఇప్పుడు జంతు హక్కుల కార్యకర్తలు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
Post a Comment