మీరు ఇంతకు ముందెన్నడూ చూడని చేపలు…సృష్టి ఎంత అందమైనదో కదా!
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కోట్ల జీవరాశులు భూమిపై జీవిస్తున్నాయి. వాటిల్లో చేపలు కూడా ఒకటి. వీటిలోనూ అనేక జాతులకు చెందిన చేపలు ఉన్నాయి. అయితే కొన్ని ప్రత్యేక జాతులకు చెందిన చేపలు మాత్రం మనకు ఎక్కడ పడితే అక్కడ కనిపించవు. కొన్ని నిర్దిష్టమైన ప్రదేశాల్లోనే అవి పెరుగుతాయి. కనిపిస్తాయి. ఈ క్రమంలోనే అలాంటి అరుదైన జాతికి చెందిన చేపల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
లాంసెట్ ఫిష్:
ఈ జాతికి చెందిన చేపల్లో రెండే రకాలు ఉంటాయి. ఈ చేపల గురించి బయాలజిస్టులకు ఎక్కువగా తెలియదు. ఇవి చాలా పెద్ద సైజులో ఉంటాయి. 2 మీటర్ల కన్నా ఎక్కువ పొడవు పెరుగుతాయి. ఇవి ఇతర చేపలను తిని జీవిస్తాయి. ధ్రువ ప్రాంతాల్లో తప్ప అన్ని చోట్ల ఈ చేపలు దాదాపుగా మనకు కనిపిస్తాయి. కానీ సముద్రాల్లో ఎక్కువ ఉంటాయి.
జెల్లీనోసెస్:
వీటినే టాడ్‌పోల్ ఫిష్ అని పిలుస్తారు. ఇవి జెల్లీ టైప్‌లో ఉంటాయి. అందువల్ల వీటికి ఆ పేరు వచ్చింది. సముద్ర గర్భంలో చాలా లోతులో ఇవి జీవిస్తాయి. వీటిలో ముళ్లు పెద్దగా ఉండవు. ఇవి కూడా 2 మీటర్ల కన్నా ఎక్కువ పొడవు పెరుగుతాయి.
కలుగ:
ప్రపంచంలో తాజా నీటిలో పెరిగే చేపల్లో ఇవి పెద్దవి. ఇవి ఏకంగా 5.6 మీటర్ల వరకు పొడవు పెరుగుతాయి. చిన్న కారు సైజులో ఉంటాయి. ఇవి రష్యా, చైనా నదుల్లో ఎక్కువగా పెరుగుతాయి.
Advertisement
ఫ్లయింగ్ గర్నార్డ్:
అట్లాంటిక్ సముద్రంలో ఈ చేపలు ఎక్కువగా పెరుగుతాయి. ముళ్లతో కూడిన రెక్కల వంటి నిర్మాణాలు వీటికి ఉంటాయి.
సీ రాబిన్స్:
వీటికి ఇతర జీవులకు ఉన్నట్లుగా 6 కాళ్లు ఉంటాయి. నీలి రంగు బార్డర్ తో నలుపు రంగులో మొప్పలు ఉంటాయి. ఇవి డ్రమ్ ను పోలిన శబ్దాలను సృష్టిస్తాయి.
చైనామన్-లెదర్‌జాకెట్:
చూసేందుకు ఈ చేపలు చాలా చిన్నగా ఉంటాయి. కానీ వీటిని తక్కువ అంచనా వేయకూడదు. వీటికి పదునైన దంతాలు ఉంటాయి. వాటితో ఆక్టోపస్‌లను, పెద్ద చేపలను కూడా గాయపరచగలవు. అందువల్ల వీటి జోలికి పోకూడదు.
ఫ్లాబీ వేల్‌ఫిష్:
ఇవి ఎరుపు రంగులో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. సముద్ర గర్భంలో జీవిస్తాయి. వీటిలో మగ చేపలు కేవలం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మాత్రమే ఆహారాన్ని తీసుకుంటాయి.
Post a Comment