Header Ads

మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఇలా చేస్తే చాలు..


మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఇలా చేస్తే చాలు..
ఆరోగ్యకరమైన ఆహారం, ఒత్తిడి లేని జీవితం, రెగ్యులర్ ఎక్సర్సైజ్, ప్రశాంతమైన నిద్ర, మనసుకి నచ్చిన పని ఇవన్నీ ఆరోగ్యం గా ఉండడానికి అత్యవసరం. అయితే, వీటితో పాటూ మానసిక ఆరోగ్యం కొరకు ఇంకొన్ని టిప్స్ కూడా ఉన్నాయి. అవి పాటిస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

1. ఒక జర్నల్ లేదా డైరీ లో ప్రతి రోజూ మీరు కృతజ్ఞతగా ఫీల్ అయిన మూడు విషయాలు, మీరు అనుకున్నది అనుకున్నట్టుగా చేసిన మూడు విషయాల గురించి రాయండి. ఇది ఫిజికల్ హెల్త్ కి కూడా ఎంతో హెల్ప్ చేస్తుందని అంటారు.

2. పొద్దున్నే ఒక కప్పు కాఫీ తాగండి. కాఫీ మంచి మూడ్ లో ఉంచుతుంది. మీకు కాఫీ అలవాటు లేకపోతే గ్రీన్ టీ తాగండి.

3. వెకేషన్ ప్లాన్ చేసుకోండి. లేదా ఫ్యామిలీ అందరూ కలిసే ఒక గెట్-టుగెదర్ ప్లాన్ చేయండి. ఇలాంటి యాక్టివిటీస్ బ్రెయిన్ ని చురుగ్గా ఉంచుతాయి.

4. మీకు బాగా నచ్చిన, వచ్చిన పనులకి ఇంకా మెరుగు పెట్టుకోండి. ఒక్కొక్క లెవెల్ పెరుగుతున్న కొద్దీ మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా బాగా పెరుగుతాయి.

5. మరీ వేడిగా, మరీ చల్లగా లేకుండా ఉండాలి మీరు నిద్ర పోయే రూం. అలా ఎరేంజ్ చేసుకోండి.

6. లైఫ్ లో మీ నెక్స్ట్ గోల్ ఏమిటో ఆలోచించుకుని దానికి తగిన స్టెప్స్ తీసుకోండి.

7. ఎక్స్పెరిమెంట్స్ చేయండి. కొత్త వంటకం ట్రై చేయడం, ఒక కవిత రాయడం, ఒక బొమ్మ గీయడం, పెయింటింగ్ నేర్చుకోవడం వంటివి మెంటల్ హెల్త్ కి ఎంతో హెల్ప్ చేస్తాయి.

8. మీ లైఫ్ లో మీకు బాగా దగ్గరైన వాళ్ళకి మీ ప్రేమని, ఇష్టాన్ని తెలియచేస్తూ ఉండండి. వారి మీద మీకున్న అభిమానం వారికి తెలియడం కూడా అవసరమే.

9. మీ బాధని మీలోనే దాచుకోకండి. మీరు నమ్మే వ్యక్తితో పంచుకోండి. లేదు, పేపర్ మీద రాసి ఆ పేపర్ ని ముక్కలు చేసేయండి.


10. మీకు బాగా నచ్చే యాక్టివిటీస్ లో టైమ్ స్పెండ్ చేయండి. లైఫ్ లో అంతా పాజిటివ్ గా ఎవరికీ ఉండదు, మనం పాజిటివ్ వైపు ఫోకస్ చేస్తామంతే.

11. మనసులో ఆందోళనగా ఉందా? కలరింగ్ బుక్ తీసుకుని రంగులు వేయండి. కాంప్లికేటెడ్ డిసైన్స్ అయితే మరీ మంచిది. మీ దగ్గర కలరింగ్ బుక్ లేకపోతే ముగ్గులు వేయండి, చిన్నప్పుడు కాగితం తో చేసే ఎలకలూ, పడవలూ ఎలా చేశారో గుర్తు తెచ్చుకుని మళ్ళీ అలాంటివి చేయండి.

iStock-928772290


12. హాయిగా నవ్వండి. ఫ్రెండ్స్ తో కలిసి నవ్వుకోండి, ఫ్యామిలీ తో కలిసి ఫన్నీ గా ఉండే మూవీ ఎంజాయ్ చేయండి. ఒక్కరే కూర్చుని జోక్స్ చదువుకుంటూ నవ్వుకోండి. విట్టీగా ఉండే పుస్తకాలు మీ దగ్గర ఉంటే యాంగ్జైటీ మీ దగ్గరకి కూడా రాలేదు.

13. ఒక రోజంతా మీ ఫోన్ ని మర్చిపోయి బయట తిరిగి రండి. ఎంత హాయిగా ఉంటుందో మీరే చూడండి.

14. అప్పుడప్పుడూ డార్క్ చాక్లేట్ తినండి. బ్రెయిన్ కి అది మంచి ఫుడ్.

15. ఇంట్లో డాన్స్ చేయండి. పనులు చేసుకుంటూ డాన్స్ చేయండి. పనులు తేలిగ్గా అయిపోతాయి. మీకూ హాయిగా ఉంటుంది.

16. ఆవలింత వచ్చినప్పుడు హాయిగా పూర్తిగా ఆవలించండి. మరీ పది మంది మధ్య ఉన్నప్పుడైతే నోరు కవర్ చేసుకుంటాం కానీ, మీరొక్కరే ఉన్నప్పుడు మాత్రం ఆవలింతని కూడా ఎంజాయ్ చేయండి.

17. వారానికి ఒకసారైనా తీరుబడిగా స్నానం చేయండి. సున్నిపిండితో నలుగు పెట్టుకుని కుంకుడు కాయల రసం తో తలంటి పోసుకుంటారో, మంచి స్క్రబ్ తో ఎక్స్ఫోలియేట్ చేసి మైల్డ్ షాంపూ తో తలస్నానం చేస్తారో, అది మీ ప్రిఫరెన్స్.

18. ఏదైనా ప్రాబ్లమ్‌తో సతమతం అవుతున్నారా? పేపర్ మీద రాసి చూసుకోండి, మీరు చేయాలో అంతా తేటతెల్లం గా తెలిసిపోతుంది.

19. పెట్ యానిమల్స్ తో టైమ్ స్పెండ్ చేయండి. మీరు దేన్నీ పెంచుకోకపోతే పెట్స్ ఉన్న ఫ్రెండ్ దగ్గరకి వెళ్ళీ వాటితో కాసేపు ఆడుకోండి.


20. గతాన్నీ, భవిష్యత్తునీ వదిలేసి మీ లోపలి పవర్ ని బయటకు తీయండి. ప్రతి నిమిషం ఎంజాయ్ చేయండి.

21. టూర్స్ అంటే ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, మీ ఊళ్ళోనే మీకు తెలియని ప్లేసెస్ చాలా ఉంటాయి. వాటిని ఎక్స్ప్లోర్ చేయండి.

22. వారమంతా ఏం చేయాలో, ఏం బట్టలు వేసుకోవాలో ముందే డిసైడ్ చేసి పెట్టుకోడం వల్ల మన లైఫ్ మీద మనకి ఒక కంట్రోల్ వస్తుంది.

23. ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ ఉన్న ఫుడ్స్ ని మీ డైట్ లో భాగం చేసుకోండి.

24. క్షమ అలవరచుకోండి. మీరు గతంలో చేసిన పొరపాట్లకి మిమ్మల్ని మీరు క్షమించుకోండి. అలాగే, ఇంకొకరు మీ విషయంలో చేసిన చిన్న చిన్న తప్పులు మర్చిపోండి.

25. వీలున్నంత వరకూ ఎందులోనైనా మంచి చూడడానికి ప్రయత్నించండి.

26. చిరునవ్వుతో ఉండండి.

27. మరొకరు చేసిన సాయానికి మీ కృతజ్ఞతని వారికి తెలపండి.

28. ఫ్యామిలీతో ఎక్కువ సమయం స్పెండ్ చేయండి. అంటే, అందరూ కలిసి ఏదైనా పని చేయండి. ఇల్లు సర్దండి, కొత్త వంట ట్రై చేయండి, అందరూ కలిసి ఏదైనా కొత్త భాష నేర్చుకుని రోజూ డిన్నర్ టైమ్ లో ఆ భాషే మాట్లాడాలని రూల్ పెట్టుకోండి.


29. రోజూ కాసేపు నడవండి. ఎక్సర్సైజ్ లా కాదు, ప్రశాంతంగా మీకు నచ్చిన స్పీడ్ లో నడవండి. ఈ నడక చెట్ల మధ్య చేస్తే ఇంకా మంచిది, కుదరకపోతే టెర్రస్ పైన. ఏదైనా నేచర్ కి దగ్గరగా ఉండాలి, అదీ ముఖ్యం.

30. సూర్యోదయాన్ని ఆస్వాదించండి. ఆ బూస్ట్ ఇంకేదీ ఇవ్వలేదు. అలాగే పౌర్ణమి నాటి నిండు చంద్రుణ్ణి, చల్లని వెన్నెలని ఎంజాయ్ చేయండి. ఆ ప్రశాంతతే వేరు.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

No comments

Powered by Blogger.