Header Ads

భార‌త‌దేశ చ‌రిత్ర‌లో బ‌ల‌‌మైన రాజుల‌ను చంపించేందుకు వాడిన ప‌ద్ద‌తి.!? విష‌క‌న్య తో సంభోగం!

 

భార‌త‌దేశ చ‌రిత్ర‌ను చూస్తే ఎంతో మంది బ‌ల‌వంత‌మైన రాజులు దేశంలోని ప‌లు ప్రాంతాల‌ను ప‌రిపాలించారు. ఆయా రాజుల‌కు ఇత‌ర రాజులు జ‌డుసుకునేవారు. వారి పరాక్ర‌మాల‌కు, యుద్ధ నైపుణ్యాలు, సైన్యానికి చిన్న రాజులు భ‌య‌ప‌డేవారు. అయితే బ‌ల‌వంత‌మైన రాజుల‌ను చంపేందుకు కొంద‌రు రాజులు నేరుగా యుద్ధానికి వెళ్ల‌కుండా దొంగ‌దారుల‌ను అనుస‌రించేవారు. వాటిలో ఒక అమ్మాయిల ద్వారా వ‌ల వేయ‌డం. అమ్మాయిల ఆశ చూపి అలాంటి బ‌ల‌వంత‌మైన రాజుల‌ను కొంద‌రు రాజులు అంత‌మొందించారు.



అయితే రాజుల‌ను చంపేందుకు అప్ప‌ట్లో విష క‌న్య‌ల‌ను కూడా ఉప‌యోగించేవార‌ట‌. చిన్న‌త‌నం నుంచే వారికి ర‌క ర‌కాల విషాల‌ను ఇస్తూ.. విరుగుడు మందులు ఇస్తూ పెంచుతారు. ఆ ప్ర‌క్రియ‌లో కొంద‌రు చ‌నిపోతారు. కొంద‌రు మాత్ర‌మే విషాల‌ను త‌ట్టుకుని పెరుగుతారు. అలాంటి విష క‌న్య‌ల‌ను రాజుల‌ను చంపేందుకు ఉప‌యోగించేవార‌ట‌. వారితో లైంగిక సంబంధం పెట్టుకునేందుకు ముందుగా క‌న్య‌ల‌ను రాజుల‌కు ఆశ చూపుతారు. రాజులు ఆ మాయ‌లో ప‌డి చిక్కుకుంటే విష క‌న్యతో క‌ల‌యిక‌లో వారు చ‌నిపోయేవారు. ఇలా రాజుల‌ను ఎదుర్కొనేందుకు కొంద‌రు దొడ్డి దారుల‌ను అనుస‌రించేవారు.

అయితే ఎలాంటి విషాన్న‌యినా హ‌రించుకుని అత్యంత ప్ర‌మాద‌కరంగా కొంద‌రు విష క‌న్య‌లు మారుతార‌ట‌. అలాంటి వారు కేవ‌లం స్ప‌ర్శ‌తోనే ఎవ‌రినైనా చంపే శ‌క్తిని క‌లిగి ఉండేవార‌ట‌. అలాంటి ఓ విష‌క‌న్య‌ను అప్ప‌ట్లో.. నంద మంత్రి అమాత్య రాక్ష‌సుడు చంద్ర‌గుప్త మౌర్యున్ని చంపేందుకు ప్ర‌యోగించాడ‌ట‌. కానీ చాణ‌క్యుడు ఆ క‌న్య ద్వారా ప‌ర్వ‌త‌కున్ని చంపించాడ‌ట‌. ఈ వివ‌రాల‌ను ప‌లు సంస్కృత గ్రంథాల్లోనూ మ‌నం చ‌దివి తెలుసుకోవ‌చ్చు. అలా యుద్ధంలో ఓడించ‌లేని, బ‌ల‌వంత‌మైన రాజుల‌ను అప్ప‌ట్లో విష క‌న్య‌ల‌తో చంపించేవార‌ని చరిత్ర చెబుతోంది.

No comments

Powered by Blogger.