మీకు ఈ 10 ప్లేస్ లలో ఎక్కడైనా పుట్టుమచ్చ ఉందా.? దాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చట!
పుట్టుకతో వచ్చే మచ్చలు కాబట్టి వాటిని పుట్టుమచ్చలు అంటాం… అయితే ఆ పుట్టుమచ్చలు ఉన్న ప్రాంతాన్ని బట్టి మనుషుల వ్యక్తిత్వాన్ని అంచనా వేయొచ్చట! ఓ సారి చూద్దాం… ( ఇది 100 శాతం నిజం కాకపోవొచ్చు…కేవలం తెలుసుకోడానికి మాత్రమే రాయడం జరిగింది)
1 గడ్డంపై పుట్టుమచ్చ ఉంటే..?
వీరు అందంగా ఉంటారు. ఇతరులను బాధ పెట్టరు.. ఉన్న దాంట్లో జీవితాన్ని హ్యాపీగా గడిపేస్తుంటారు.!
2. నుదుటిపై
సంపద, ఆరోగ్యం, విజయం, కీర్తి అన్ని వీరి వెంటే…. వీరు ఏ పని ప్రారంభించినా సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుందట.!
3. చెంపపై……
సున్నిత మనస్కులు., కానీ ఏ విషయాన్నైనా చాలా లోతుగా ఆలోచిస్తారు.
4. ముక్కుపై
చిన్న విషయాలకే విపరీతమైన కోపం వచ్చేస్తుంది. కానీ వెంటనే మళ్లీ దగ్గరౌతారు.
5. ఛాతిభాగంలో
లగ్జరీ లైఫ్ ను గడపాలని చూస్తుంటారు. బద్దకస్తులుగా ఉంటారు.
6. కంట్లో…
సంపాదన బాగుంటుంది., గర్వం కనిపిస్తుంది. ఆ గర్వాన్ని కంట్రోల్ లో పెట్టుకుంటే మంచి పేరు కూడా సంపాదించుకోవొచ్చు.!
7. భుజంపై
చాలా అందంగా ఉంటారు. నిజం మాట్లాడతారు, మృదుస్వభావి, తెలివిగా ఆలోచిస్తారు, బాధ్యతగా ఉంటారు.
8. చేతులపై
సంతానం గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. పిల్లలకు కావాల్సిన అన్ని అవసరాలు సమకూరుస్తారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మంచి నిర్ణయాలు తీసుకుంటారు.
9. పాదాలపై
కొత్త కొత్త ప్రదేశాలు చూడడం అంటే ఇష్టపడతారు. ప్రేమ వివాహాలకు మొగ్గు చూపుతారు.!
10. చెవిపై
కంప్లీట్ ఫ్యామిలీ పర్సన్స్… కుటుంబానికే పస్ట్ ప్రియారిటీ., మిగితాదంతా నెక్స్ట్… మంచి వ్యక్తిత్వం గలవారు.
Post a Comment