Header Ads

ప్రభాస్ అభిమానులకు కిక్కిచ్చే న్యూస్.. బర్త్ డేకు డబుల్ ధమాకా రెడీ!


 

పాన్ ఇండియా నెంబర్ వన్ హీరో ప్రభాస్ ఎలాంటి సినిమా చేసినా కూడా భవిష్యత్తులో సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడం కాయమని ఒక క్లారిటి వచ్చేసింది. బాలీవుడ్ హీరోల కంటే హై రేంజ్ లో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్న రెబల్ స్టార్ ప్రస్తుతం వరుసగా మూడు పెద్ద సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ప్రభాస్ పుట్టినరోజు స్పెషల్..



 ప్రభాస్ పుట్టినరోజు స్పెషల్.. నాలుగు పదుల వయసులో ఉన్న ప్రభాస్ అక్టోబర్ 23న 41వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ప్రభాస్ అభిమానులకు గత ఏడాది పుట్టినరోజుకు పెద్దగా సర్ ప్రైజ్ ఏమి ఇవ్వలేదు. ఇక ఈసారైనా మంచి సర్ ప్రైజ్ వస్తుందేమోనని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ లతో ప్రభాస్ పేరును ట్రెండ్ చేయాలని ఫ్యాన్స్ గట్టి టార్గెట్ సెట్ చేసుకున్నారు. 

రాధే శ్యామ్ స్పెషల్ టీజర్



రాధే శ్యామ్ స్పెషల్ టీజర్ ప్రభాస్ వరుసగా మూడు సినిమాలను సెట్స్ పైకి తెచ్చిన విషయం తెలిసిందే. ముందుగా రాధే శ్యామ్ సినిమాతో పిరియాడిక్ డ్రామాలో సరికొత్త రొమాంటిక్ టచ్ ఇవ్వబోతున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఆ సినిమాకు జిల్ డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ బర్త్ డే టీజర్ ని ప్రభాస్ పుట్టినరోజున విడుదల చేసే అవకాశం ఉందట. అదిపురుష్ హీరోయిన్.. 

అదిపురుష్ హీరోయిన్..



ఇక ప్రభాస్ మొదటిసారి బాలీవుడ్ టెక్నీషియన్స్ తో కలిసి చేస్తున్న చిత్రం ఆదిపురుష్. రామాయణ కథ ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా పూర్తిగా 3Dలో రానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక స్పెషల్ అప్డేట్ ని ప్రభాస్ బర్త్ డేకు రివీల్ చేయనున్నారు. ముఖ్యంగా హీరోయిన్ పై ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఓం రావత్ ఆ సినిమాకు దర్శకత్వం వహించనున్న తెలిసిందే. వాళ్ళు కూడా సర్ ప్రైజ్ ఇస్తారా..? ప్రభాస్ పుట్టినరోజున ఈ సారి ఊహించని సర్ ప్రైజ్ లు ఉంటాయని టాక్ వస్తోంది. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తున్న సైన్స్ ఫిక్షన్ సినిమాకు సంబంధించిన అప్డేట్ కూడా ఏదైనా ఇస్తారేమో చూడాలి. పుట్టినరోజు కాబట్టి ఎదో ఒక విధంగా సర్ ప్రైజ్ చేసి విష్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి తప్పకుండా వాళ్ళు కూడా అభిమానులకు కిక్కిచ్చే అప్డేట్ ఇస్తారని తెలుస్తోంది. మరి ఈ గాసిప్స్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.


No comments

Powered by Blogger.