Home
/
Gossips
/
Movies
/
Anushka: పెళ్లి పీటలపై ప్రభాస్- అనుష్క! ఆనాడే జరిగిపోయింది.. సింగిల్ లైన్‌లో మ్యాటర్ చెప్పేసిన స్వీటీ
Anushka: పెళ్లి పీటలపై ప్రభాస్- అనుష్క! ఆనాడే జరిగిపోయింది.. సింగిల్ లైన్‌లో మ్యాటర్ చెప్పేసిన స్వీటీ
పెళ్లి పీటలపై ప్రభాస్- అనుష్క జోడీని చూసి ఖుషీ అవుతున్నారు ఆడియన్స్. మరి ఇది నిజమేనా? అయితే ఎప్పుడు వీరి పెళ్లి జరిగింది? అనే ఆసక్తికర విషయాలు చెబుతూ సూపర్బ్ రియాక్షన్ ఇచ్చింది అనుష్క.
పెళ్లి పీటలపై ప్రభాస్- అనుష్క!
అనుష్క ఫోటో ఒకటి వైరల్ కావడం, దానిపై అనుష్క రియాక్ట్ కావడం జరిగాయి.
అయితే ఇటీవలే ట్విట్టర్‌లోకి అధికారికంగా అడుగుపెట్టిన అనుష్క.. నిన్న(ఆదివారం) మొదటిసారి అభిమానులతో ట్విట్టర్ వేదికగా ముచ్చటించింది. ఈ చిట్ చాట్‌లో ఓ నెటిజన్.. ఈ పిక్ షేర్ చేస్తూ దీనిపై మీ రియాక్షన్ ఏంటని అడిగాడు. దీంతో వెంటనే స్పందించిన స్వీటీ..''మిర్చి చిత్ర షూటింగ్‌లో సన్నివేశం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు తీసిన ఓ అందమైన ఫోటో ఇది. మిర్చి నా హృదయానికి చేరువైన చిత్రం. యూవీ క్రియేషన్స్ వారి మొదటి చిత్రం. ప్రమోద్, వంశీ, విక్కి మంచి మనసున్న నిర్మాతలు'' అని తెలిపింది.
ఇకపోతే సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి రీ ఎంట్రీ ఇచ్చిన అనుష్క ఈ వారమే 'నిశ్శబ్దం' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఓటీటీ వేదికగా విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. మరోవైపు ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.
Post a Comment