Header Ads

వీడియో: ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, కాలింగ్ అన్నీ ఫ్రీ.. జియో కొత్త ప్లాన్లు ఇవే!

 


జియో తన వినియోగదారులకు కొత్త పోస్ట్ పెయిడ్ ప్లాన్లను ప్రకటించింది. ఈ ప్లాన్ల ద్వారా అద్భుతమైన లాభాలను జియో అందిస్తోంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వీఐపీ సబ్ స్క్రిప్షన్లతో పాటు 650 లైవ్ టీవీ చానెల్స్, వీడియో కంటెంట్, 5 కోట్ల పాటలు, 300 వరకు న్యూస్ పేపర్లు కూడా ఈ ప్లాన్ ద్వారా అందుబాటులో ఉన్నాయి. రూ.399, రూ.599, రూ.799, రూ.999, రూ.1,499 ధరల్లో ఈ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. రూ.1,499 ప్లాన్ ద్వారా అంతర్జాతీయ కాలింగ్ కూడా అందుబాటులో ఉంది. జియో వినియోగదారులు దీని కోసం కొత్త సిమ్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఫోన్ నంబర్ మార్చాల్సిన అవసరం లేదని, డౌన్ టైమ్ కూడా ఉండదని కంపెనీ తెలిపింది.

No comments

Powered by Blogger.