Header Ads

‘అంధాదున్’ రీమేక్ అప్‌డేట్: లొకేషన్ల వేటలో దర్శకుడు బిజీబిజీ

 

అంధాదున్ కోసం లొకేషన్ల వేట
లాక్‌డౌన్ కారణంగా ఆరు నెలలుగా నిలిచిపోయిన సినిమా షూటింగులు మళ్లీ మొదలయ్యాయి. కేంద్ర ప్రభుత్వ విధివిధానాలతో షూటింగ్‌లకు పర్మిషన్స్‌ ఇవ్వడంతో స్టార్స్‌ సెట్స్‌లోకి అడుగుపెడుతున్నారు. దీంతో టాలీవుడ్‌లో సందడి నెలకొంది. ఈ కోవలో హీరో నితిన్‌ 'రంగ్‌దే' షూటింగ్ నిమిత్తం యూనిట్‌తో కలిసి ఇటలీకి వెళ్లేందుకు సిద్దమయ్యాడు. దీంతో పాటు ఆయన బాలీవుడ్ సూపర్‌హిట్ మూవీ ‘అంధాదున్’ను రీమేక్‌లో నటిస్తున్నారు.

మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించే ఈ సినిమాలో నభా నటేష్ హీరోయిన్‌గా, మిల్కీ బ్యూటీ తమన్నా కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ లొకేషన్ల వేట కొనసాగిస్తున్నారు డైరెక్టర్ మేర్లపాక గాంధీ. ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేశ్‌లో కలిసి ప్రస్తుతం గోవాలో పర్యటిస్తున్నారు. ఈ సినిమాను నితిన్ తండ్రి ఎన్‌.సుధాకర్‌రెడ్డి, సోదరి నికితారెడ్డి నిర్మిస్తున్నారు. నవంబర్‌లో షూటింగ్ ప్రారంభం కానుంది.

No comments

Powered by Blogger.