తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో బ్రహ్మ కమలం పుష్పాలు విరబూసాయి. డైయిరీ ఫారమ్ సెంటర్‌కు చెందిన పెంకే రవికుమార్ నివాసంలో ఉన్న బ్రహ్మ కమలం మొక్కకు ఒకే సమయంలో 38 పుష్పాలు విచ్చుకున్నాయి. శ్వేత వర్ణ పుష్పాలను చూసేందుకు స్థానికులు తరలివచ్చారు. ఒకేసారి 38 పుష్పాలు పూయడంపై ఇంటి యజమాని కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో బ్రహ్మ కమలాలు పూస్తాయని అనుకోలేదన్నారు. కొంతమంది స్థానికులు అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. బ్రహ్మ కమలం శివునికి అత్యంత ప్రీతికరమైనది భక్తుల విశ్వాసం. హిమాలయాల్లో దొరికే ఈ మొక్క ఇంట్లో ఉంటే మంచిదని అందరూ భావిస్తారు. కొన్ని గంటలు మాత్రమే వికసించే ఈ అందమైన పుష్పాన్ని చూసేందుకు జనాలు కూడా పెద్ద సంఖ్యలో వస్తుంటారు. కానీ కొన్ని మొక్కలకు మాత్రమే ఇలా భారీ పుష్పాలు వికసిస్తాయి అంటున్నారు.
Post a Comment