అవును…నా భర్తను నేనే జైలుకు పంపాను. ఇందులో నా తప్పేమైనా ఉందా? #ఇది నా కథ
ఇది నా కథ…. నాకు పెళ్లి చేస్తే భారం తీరుతుందని సంబంధాలు వెతకడం మొదలు పెట్టారు మా తల్లిదండ్రులు. నాన్న రిక్షా నడిపేవాడు అందుకే సంబంధాలు కూడా మా పరిధిలోనివే.! ఎట్టకేలకు ఒకడిని నా భర్తగా నిర్ణయించేశారు…..ఆడపిల్లకు పెళ్లిపై ఎన్ని ఆశలుంటాయో నాకు అలాగే ఉన్నాయి! పెళ్లైన రాత్రి…. పడక గదిలోకి తాగొచ్చాడు నాభర్త… జీవితాంతం గుర్తుండిపోయే
శోభనాన్ని మానభంగంగా మార్చేశాడు ఆ క్రూరుడు! 16 ఏళ్ల వయస్సుల్లో నొప్పితో అల్లల్లాడిపోయాను…అతను తాగిన మత్తులో నామీద ఇంకా ఊగుతూ పోయాడు!
సరిగ్గా నెల తర్వాత…. రాత్రి తన స్నేహితుడితో ఇంటికొచ్చాడు…నా ఫ్రెండ్ నాకు డబ్బులిచ్చాడు…నువ్వు అతడితో ఈ రాత్రి గడుపు అన్నాడు…కోపంతో ఎదిరించబోయాను…ఇద్దరు కలిసి నన్ను కొట్టారు….వచ్చిన వాడు కోరిక తీర్చుకున్నాడు…మా ఆయన అలా వచ్చిన డబ్బును తన జేబులో నింపుకున్నాడు!
ఏడాదిన్నర తర్వాత…. నాకు నెలలు నిండాయి..డెలివరీ కావాల్సి ఉంది..లోలోపల దేవుడికి దండం పెట్టుకున్నాను…ఆడపిల్ల వద్దని…కానీ దేవుడు నా మొర ఆలకించలేదు…ఆడపిల్లే పుట్టింది!
నా కూతురికి 12 ఏళ్ల వయస్సులో…… ఈ సారి ఇంకో స్నేహితుడిని తీసుకొచ్చి నా కూతురి గదిలోకి పంపే ప్రయత్నం చేస్తున్నాడు నా భర్త.! నా గతం గుర్తొచ్చింది…కోపం ఉబికొచ్చింది…కూరగాయలు కోసే కత్తితో నా భర్తను ,అతడితో వచ్చిన వాడిని బెదిరించాను….వాళ్లు పారిపోయారు.! తర్వాత పోలీస్ స్టేషన్ కు వెళ్లి వారిపై కేసు పెట్టాను. నా భర్త పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు.
ఇప్పుడు ఇంటి చుట్టుపక్కల వాళ్ల దృష్టిలో నేనో చెడ్డదానిని…భర్తను జైలుకు పంపించిన పాపిష్టిదానిని…ఎన్నో మాటలు ..ఎన్నో బూతులు….అయినా నాకు సంతోషంగా ఉంది…నా కూతురి భవిష్యత్ ను రక్షించినందుకు…నాలాగా నా కూతురు లోలోపల కుంగిపోకుండా కాపాడినందుకు.! నేను చేసింది తప్పని నేను ఏరోజూ అనుకోలేదు.
Post a Comment