సినిమాల్లోనే కాదు….నిజ జీవితంలో కూడా ఇలాగే.! ఒక్కసారిగా ఎందుకు ఆ మార్పు?
లాస్ట్ ఇయర్ వచ్చిన “డియర్ కామ్రెడ్” సినిమాలో లిల్లి పాత్రలో నటించిన రశ్మిక డ్రెస్సింగ్ స్టార్టింగ్ లో మోడర్న్ గర్ల్ లా ఉంటుంది..తన మాటల్లో ,చేతల్లో ఆత్మవిశ్వాసం ఉట్టిపడుతుంది. అదే హీరోని తన ప్రేమలో పడేలా చేస్తుంది..కానీ తనపై లైంగిక దాడి జరగగానే ఒక్కసారిగా తన వెర్షన్ మారిపోతుంది.. కెరీర్ వదిలిపెట్టుకుని,ఇంట్లోనే ఒంటరిగా గడుపుతూ ఉంటుంది..అంతే కాదు డ్రెస్సింగ్ స్టైల్ కూడా మారిపోతుంది..మొదట్లో స్కర్స్ట్, స్లీవ్ లెస్ టాప్స్ వేసుకున్న అమ్మాయి, చుడిదార్ వేసుకుని దుపట్టా కప్పుకుని కనపడుతుంది..ఆత్మవిశ్వాసం కోల్పోయినట్టుగా..
ఒక్కసారిగా డ్రెస్సింగ్ స్టైల్ మార్చి ఏం చెప్పదలచుకున్నారు.. అంటే వేధింపులకు గురైన అమ్మాయి తనని తాను దోషిగా చూసుకుంటూ ,ఆత్మవిశ్వాసం కోల్పోయినట్టుగా చూపించడానికి డ్రెస్సింగ్ స్టైల్ మార్చడం ఎంత వరకు కరెక్ట్.. ఇక్కడ చున్నీ వేసుకునే అమ్మాయిలకు ఆత్మవిశ్వాసం లేదన్నది పాయింట్ కాదు..కేవలం ఈ సినిమానే కాదు చాలా సినిమాల్లో ఇదే పరిస్థితి మనం చూడొచ్చు..
ఇలాంటివి చాలా చిన్నవిగా కనిపిస్తాయి కానీ, కొన్నిసార్లు పెద్ద పరిణామాలకు దారి తీస్తాయి..వాడికేం మగాడు.. అమ్మాయిలే జాగ్రత్తగా ఉండాలి అనే అన్ రిటన్ స్టాండర్డ్స్ తెలియకుండానే దుష్పరిణామాలకు దారితీస్తాయి.. ఇటువంటి మాటలు, చేష్టలే అత్యాచారం అబ్బాయి ఘనకార్యంగా, అమ్మాయిలదే తప్పులా భావించే పరిస్థితి కల్పిస్తాయి..ఇలాంటి నెగటివ్ స్టాండర్డ్స్ ని దూరం చేయాలంటే పిల్లలు చిన్నప్పటి నుండే పేరెంట్స్ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది..
అమ్మాయిలపై లైంగిక దాడులు జరిగితే దాడి చేసిన వాడు సొసైటిలో దర్జాగా బాగానే తిరుగుతుంటాడు..కానీ బాదితురాలు మాత్రం బిక్కు బిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి… ఇలాంటి ఘటనలు జరిగిన ప్రతిసారి చర్చకు వచ్చే ఒకే అంశం అమ్మాయిల డ్రస్.. అలా వాదించేవారి పద్దతి ఎలా ఉంటుంది అంటే చుడిదార్స్ వేసుకుని నిండుగా దుపట్టా కప్పుకునే వారిపై అసలు అత్యాచారాలే జరగట్లేదు అన్నట్టుగా.. ఈ విషయాన్ని సినిమాలు కూడా ఇండైరెక్ట్ గా కాదు, డైరెక్ట్ గానే ప్రోత్సహిస్తూ ఉంటాయి అనడానికి ఇదొక ఉదాహరణ..!
Post a Comment