Header Ads

HBD Rakul: నితిన్ 'చెక్' నుంచి న్యూ పోస్టర్.. ఆసక్తి రేకెత్తిస్తున్న అందాలతార రూపం

 

నితిన్ 'చెక్' నుంచి న్యూ పోస్టర్.. ఆసక్తి రేకెత్తిస్తున్న అందాలతార రూపం
నేడు (అక్టోబర్ 10) అందాల భామ, స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ 30వ పుట్టినరోజు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆమెకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా హ్యాపీ బర్త్ డే రకుల్ అంటూ ఆమె లేటెస్ట్ మూవీ 'చెక్' నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది ఆ సినిమా యూనిట్. ఈ పోస్టర్‌లో చాలా సీరియస్‌గా కనిపిస్తున్న రకుల్.. చేతిలో ఓ ఫైల్ పట్టుకొని ఉంది. ఇది చూస్తుంటే ఈ మూవీలో రకుల్ క్యారెక్టర్‌ ఎంతో ప్రాధాన్యతతో కూడి ఉంటుందని తెలుస్తోంది.
భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఈ చెక్ మూవీ రూపొందుతోంది. ఇటీవలే విడుదల చేసిన ఈ చిత్ర ప్రీలుక్‌ ప్రేక్షకలోకాన్ని విశేషంగా ఆకట్టుకుంది. చిత్రానికి వి. ఆనంద ప్రసాద్ నిర్మాణ బాధ్యతలు చేపట్టగా.. నితిన్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. చదరంగం నేపథ్యంలో సాగే సరికొత్త కథాంశంలో థ్రిల్ చేసేందుకు రెడీ అవుతోందట చెక్ యూనిట్.

ఓ ఉరిశిక్ష పడిన ఖైదీ కథ ఇది అని, ఇందులో నితిన్ అద్భుతమైన నటనను చూడబోతున్నారని చిత్రయూనిట్ అంటోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఈ నెల 12 నుంచి నెలాఖరు వరకు చివరి షెడ్యూల్ పూర్తిచేసి రిలీజ్ డేట్ ప్రకటిస్తామని అన్నారు చిత్ర దర్శకనిర్మాతలు.

No comments

Powered by Blogger.